ఫిరాయింపుదారుల కోట పిఆర్పీ
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అన్ని పార్టీల నుంచి ఫిరాయించిన నాయకుల పాలిట స్వర్గంగా మారిపోయింది. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ (టిడిపి) చెరి తొమ్మిది మంది ఫిరాయింపుదారులకు టిక్కెట్లు ఇవ్వగా పిఆర్పీ ఏకంగా 59 మందికి పోటీకి అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఒకే ఒక ఫిరాయింపుదారుడు యూసుఫ్ అలీకి టిక్కెట్ ఇచ్చింది. టిడిపి నుంచి అధికారికంగా రాజీనామా చేయని యూసుఫ్ అలీ టిఆర్ఎస్ తరఫున జహీరాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి రాజీనామా చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నల్లగొండ లోక్ సభ స్థానానికి టిక్కెట్ ఇచ్చింది. టిడిపి నుంచి వచ్చిన మందా జగన్నాథం కాంగ్రెస్ అభ్యర్థిగా మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అదే విధంగా టిడిపి నుంచి వచ్చిన చెరుకు ముత్యం రెడ్డికి మెదక్ జిల్లాలో దుబ్బాక అసెంబ్లీ స్థానంలో పోటీకి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది.
ఇంకా మాజీ టిడిపి నాయకులు కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి, జి. వీరశివారెడ్డి, ఎస్.వి. మోహనరెడ్డిలకు, టిఆర్ఎస్ నుంచి వచ్చిన దుగ్యాల శ్రీనివాసరావు, నారాయణరావు పటేల్, టి. జయప్రకాశ్ రెడ్డిలకు కూడా కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చింది. ఇక ముద్రగడ పద్మనాభం చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయనకు కూడా పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీకి టిక్కెట్ లభించింది.టిడిపి అధికార కాంగ్రెస్ నుంచి వచ్చిన నూకారపు సూర్యప్రకాశరావుకు అనకాపల్లి లోక్ సభ స్థానంలో పోటీకి టిక్కెట్ ఇచ్చింది. టిడిపి సాలూరు అసెంబ్లీ స్థానంలో పోటీకి గుమ్మడి సంధ్యా రాణికి, ఏలూరు లోక్ సభ స్థానంలో పోటీకి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు కూడా టిక్కెట్లు ఇచ్చింది. వారిద్దరు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. పిఆర్పీ నుంచి వచ్చిన చిన్నం రామకోటయ్యకు కూడా టిడిపి టిక్కెట్ ఇచ్చింది. టిడిపి టిక్కెట్లు లభించిన ఇతర కాంగ్రెస్ ఫిరాయింపుదారులలో మాజీ ఎంఎల్ఎ శ్రీరామ్ రాజగోపాల్, కె. మదన్ మోహన్ రెడ్డి, పుట్టా నరసింహారెడ్డి, ఇరిగెల రాంపుల్లా రెడ్డి, సాగర్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా ఉన్నారు.
అయితే, ఫిరాయింపుదారులకు టిక్కెట్లు ఇవ్వడంలో పిఆర్పీ ఇతర పార్టీలన్నిటినీ మించిపోయింది. వారిలో ఎక్కువ మంది టిడిపి నుంచి వచ్చినవారే. వారి పేర్లు: నాగూరు: నిమ్మక జయరాజు, వైజాగ్ లోక్ సభ: పల్లా శ్రీనివాస్, మెదక్: బట్టి జగపతి, విజయనగరం లోక్ సభ : కె. గణపతిరావు, వరంగల్ తూర్పు: ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బెల్లంపల్లి (ఎస్ సి): ఎ. శ్రీదేవి, నిర్మల్: ఎ. మహేశ్వరరెడ్డి, ఆమదాలవలస: తమ్మినేని సీతారామ్, ఎచ్చెర్ల: కిమిడి కళా వెంకటరావు, రాజాం (ఎస్ సి): కె. జోగులు, అనకాపల్లి: గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఉత్తరం: ఎస్. రెహ్మాన్, జుక్కల్ (ఎస్ సి): అరుణ తార, హుస్నాబాద్: ఇ. పెద్ది రెడ్డి, గజ్వేల్: జి. ఎలక్షన్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్ సి): నర్రా రవికుమార్, సికింద్రాబాద్: మేకల సారంగపాణి, అచ్చంపేట: పుట్టపాక మునీంద్రనాథ్, గద్వాల: గట్టు భీముడు, అలంపూర్ (ఎస్ సి): సురవ శోభారాణి, నంద్యాల లోక్ సభ: భూమా నాగిరెడ్డి, కడప లోక్ సభ: ఎస్.ఎ. ఖలీల్ బాషా, మచిలీపట్నం లోక్ సభ : సి. రామచంద్రయ్య.
Pages: 1 -2- News Posted: 9 April, 2009
|