బ్లాక్ మనీపైనే బాబు ఆశలు!
హైదరాబాద్ : పూర్వం ఒక నిరుపేద తనను అదృష్ట దేవత కరుణించగలదనే ఆశతో చందమామను తీసుకువచ్చిఇస్తానని తన పిల్లలకు మాట ఇస్తాడు. కాని అదృష్ట దేవత కరుణా కటాక్షాలు అతనికి లభించలేదు. అతని ఆశ అడియాసే అయింది. తల్లులు రాత్రి భోజనానంతరం తమ పిల్లలను జోకొడుతూ చెప్పే ఒక తెలుగు జానపద కథ ఇది.
రాష్ట్రం ఇటువంటి అనుభవాన్నే చవి చూడబోతున్న సూచనలు గోచరిస్తున్నాయి. తన పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి 'స్విస్ బ్యాంకులలో మూలుగుతున్న నల్ల ధనాన్ని' తీసుకురావాలన్న తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష గురించే ఈ ప్రస్తావన. జానపద గాథలో వలె చంద్రబాబు నాయుడు ప్రజలకు సాక్షాత్తు చందమామనే వాగ్దానం చేశారు. అదే ... ప్రతి నెల మొదట్లో ఉచితంగా నగదు అందజేయగలమనే వాగ్దానం. నగదు బదలీ పథకం కింద మధ్య తరగతివారికి, పేదలకు, మరీ నిరుపేదలకు వరుసంగా రూ. 1000, రూ. 1500, రూ. 2000 చెల్లించగలమని ఆయన ప్రకటించారు.
Pages: 1 -2- News Posted: 10 April, 2009
|