రెడ్డి వోట్లకు జగన్ గాలం
గుంటూరు: గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని రెడ్డి వోట్ బ్యాంక్ ను గంపగుత్తుగా కొల్లగొట్టడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలలో రెడ్డి కులస్థుల ప్రాబల్యం గల ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఒంగోలు, నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గాలలో రెడ్డి అభ్యర్థులను నిలబెట్టడంతో జగన్ కనిగిరి, గిద్దలూరు, దర్శి, సంతనూతలపాడు, ఒంగోలు సెగ్మెంట్లలో విస్తృతంగా సందర్శించారు. ఆయన గురువారం మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడికొండ, గుంటూరు నియోజకవర్గాలలో పర్యటించారు. ఆయన పర్యటించిన సెగ్మెంట్లలో చాలా వరకు రెడ్డి జనాభా అధికంగా ఉన్న, కాంగ్రెస్ పార్టీకి కోటలు వంటి ప్రాంతాలే కావడం విశేషం.
పార్టీకి సాంప్రదాయక వోటు బ్యాంకులో చీలికను కనీస స్థాయికి తగ్గించడమే ఆయన ఈ పర్యటన లక్ష్యంగా భావిస్తున్నారు. ఒంగోలు లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పోటీగా ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) పిడతల సాయి కల్పనా రెడ్డిని నిలబెట్టింది. ఆమె టిడిపి మాజీ శాసనసభ్యురాలు. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, జగన్ మిత్రుడు వల్లభనేని బాలశౌరికి పోటీగా టిడిపి మోదుగుల వేణుగోపాలరెడ్డిని నిలబెట్టింది.
Pages: 1 -2- News Posted: 10 April, 2009
|