'రాజ్యం' కోటకు బీటలు!
హైదరాబాద్: ఈ నెల 16న జరగనున్న మొదటి దశ ఎన్నికలలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) యంత్రాంగం యావత్తు పూనుకోవలసిన తరుణంలో నయవంచన, మ్యాచ్ ఫిక్సింగ్, టిక్కెట్ల అమ్మకం వంటి తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్టీ నాయకులు బాహాటంగా పరస్పరం బురద చల్లుకుంటున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, శ్రేయోభిలాషులే అధిష్టానంపై నేరుగా చేస్తున్న ఆరోపణలు పార్టీలో తీవ్రప్రకంపనాలను సృష్టిస్తోంది.
మొదటి దశ ఎన్నికలు జరిగే తెలంగాణ ప్రాంతం, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ప్రజారాజ్యం తన బలాన్ని పరీక్షించుకోనున్నది. తొలి దశ ఎన్నికల సందర్భంగా 22 లోక్ సభ నియోజకవర్గాలలోను, 152 అసెంబ్లీ నియోజకవర్గాలలోను పోలింగ్ జరగనున్నది. మొదటి దశ ఎన్నికలలో సుమారు 3.11 కోట్ల మంది వోటర్లు తమ వోటు హక్కు వినియోగించుకోబోతున్నారు.
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు మొదట్లో పిఆర్పీకి బలమైన స్థావరాలు అయ్యాయి. స్తానిక కుల, వర్గ సమీకరణాలు, తదితర రాజకీయ కారణాలపై తెలుగు దేశం పార్టీ (టిడిపి) నుంచి తమ్మినేని సీతారామ్ (ఆమదాలవలస), కమిడి కళా వెంకటరావు (ఎచ్చెర్ల), కంబాల జోగులు (రాజాం ఎస్ సి), గంటా శ్రీనివాసరావు (అనకాపల్లి), ఎస్. రెహ్మాన్ (విశాఖపట్నం నార్త్), పల్లా శ్రీనివాసరావు (విశాఖపట్నం లోక్ సభ), కిమిడి గణపతిరావు (విజయనగరం లోక్ సభ) పిఆర్పీలో చేరారు.
Pages: 1 -2- News Posted: 11 April, 2009
|