'మిత్ర' ద్రోహం?
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నాయకుడు మిత్రా పార్టీలో సంతృప్తిగానే ఉన్నారా? పార్టీ నాయకత్వం మీద కస్సు బుస్సులాడిన మిత్రా అంతలోనే ఎలా మళ్లీ కలిసిపోయారు? కలిసి వెళ్లిపోదామన్న పరకాలకు మిత్రద్రోహం చేశారా? ప్రజారాజ్యం కార్యకర్తలు ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరక్క తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. మిత్రుడు సీటు కేటాయించకపోవడంతో మొదట్లో సీరియస్ అయిపోయిన మిత్రా ఉన్నట్టుండి ముఖం చాటేశారు. పార్టీ ఆఫీసులో ఎప్పుడూ హడావిడి చేసే ఆయన సీట్ల కేటాయింపు తరువాత జాడలేకుండా పోయారు. అలిగారంటూ పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రం, గవగబా వచ్చి 'అబ్బే అదేం లేదు' అంటూ ఏవేవో కథలు చెప్పేవారు. ఏవో ఇతర పనుల్లో బిజీగా ఉంటున్నాననేవారు. అయితే 'సీటు లేదు కాని గాడిద చాకిరీ' అని సన్నిహితుల దగ్గర మిత్రా అంటుండే వారట!
పరకాలతోనూ ఆయన తరచూ సమావేశమయ్యేవారు. ఇద్దరూ కలిసే పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు వారి సన్నిహితులే చెప్పేవారు. అయితే ముహూర్తం పెట్టుకున్న రోజున మాత్రం సీను తారుమరయింది. పరకాల ఒంటరిగానే వెళ్లిపోయారు. మిత్రా మెత్తబడడం వెనుక ఏదో ఉందంటూ పార్టీ వర్గాలు రకరకాలుగా చర్చించుకుంటున్నాయి. తనకు బెర్త్ దక్కకపోయినా తనవారు ముగ్గురికి టిక్కెట్లు సంపాదించుకున్నారని అసమ్మతివాదుల మాట. నాగర్ కర్నూల్ అభ్యర్ధి నూర్జహాన్ అభ్యర్ధిత్వం ఇప్పటికే రచ్చకెక్కింది. ఆమె దగ్గర మిత్రాయే కోట్లు తీసుకుని సీటిప్పించారని చెప్పుకుంటున్నారు.
Pages: 1 -2- News Posted: 11 April, 2009
|