మనీ, మందు కాక్ టెయిల్!
హైదరాబాద్ : అది పార్టీ సమయం. స్థలం: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అడ్డగుట్ట మురికివాడ. సమయం: ఆదివారం రాత్రి 11.30 గంటలు. రాత్రి కారు చీకటిగా ఉన్న సమయంలోనే ఒక రాజకీయ పార్టీకి చెందిన ఆరుగురు వ్యక్తులు రెండు వేర్వేరు ప్రదేశాలకు - అంటే ఒక హోటల్ కు, ఒక పార్టీ కార్యాలయం సమీపంలోని ఒక సందులోకి కొన్ని వేల మందిని పిలిపించారు. సరిగ్గా పది నిమిషాలలో మహిళలకు రూ. 200 వంతున, పురుషులకు రూ. 300 వంతున నగదు పంపిణీ చేసి, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందిగా కోరారు. పురుషులకు ఒక మద్యం సీసాను కూడా అందజేశారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరికి చుట్టూ మద్యం సీసాలు చెల్లా చెదరుగా పడి ఉండగా మద్యం మత్తు ఇంకా వీడని పురుషులు కనిపించారు. 'నేను మద్యం కారణంగానే పార్టీ కోసం ప్రచారం చేస్తున్నాను. వారు సప్లయిలు ఆపివేస్తే నేను వారి వెంట తిరగడం మానివేస్తాను' అని 40 సంవత్సరాల వ్యక్తి నిషా స్వరంతో చెప్పాడు. హైదరాబాద్ నగరంలో చాలా మురికివాడలలో పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు. పోలింగ్ కు కేవలం రెండు రోజులు వ్యవధి ఉండడంతో రాజకీయ పార్టీలు వోటర్లను ఆకట్టుకోవడానికి నిస్సంకోచంగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నాయి. అయితే, మంగళవారం రాత్రి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఒక్కొక్క వోటరుకూ రూ. 500 ఇవ్వగలమని అభ్యర్థుల ఏజెంట్లు వాగ్దానం చేశారు. 'అది ఆఫర్ మాత్రమే. కాని మేము ఒక్కొక్కరికీ రూ. 1000 లోపు మొత్తానికి సిద్ధపడం' అని అడ్డగుట్ట మురికివాడ వాసి ఒకరు చెప్పారు.
రాజకీయ పార్టీలు ఒక్కొక్కరికీ రూ. 500 ఇవ్వజూపుతుండగా తమ వోట్లే కీలకమని తెలిసిన మురికివాడల వాసులు రాజకీయ నాయకుల నుంచి సాధ్యమైనంత ఎక్కువ మొత్తం రాబట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ మురికివాడలో రాజకీయ పార్టీల స్థానిక నాయకులు ఆదివారం ఒక్కొక్క వ్యక్తికి రూ. 300 పంపిణీ చేశారు. మురికివాడల వాసులు కనీసం 50 మందికి డబ్బు అందింది. వచ్చే రెండు రోజులలో ఆ పరిసరాలలని మరికొన్ని మురికివాడల వాసులకు డబ్బు అందగలదు. కాంగ్రెస్ అభ్యర్థి పి. విష్ణువర్ధన్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అభ్యర్థి హుమాయూన్, మహా కూటమి అభ్యర్థి మహమ్మద్ సలీమ్ ఈ నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు.
Pages: 1 -2- News Posted: 14 April, 2009
|