టైర్ ట్యూబుల్లో డబ్బు
హైదరాబాద్ : ఎన్నికల కమిషన్ (ఇసి) నియమించిన పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) పర్యవేక్షణలో డేగకళ్ళ పోలీసుల నిఘాను తప్పించుకోవడానికై రాజకీయ పార్టీలు వోటర్లకు పంపిణీ నిమిత్తం డబ్బు తీసుకువెళ్ళేందుకు వినూత్న పద్ధతులు అనుసరిస్తున్నాయి.
అంబులెన్స్ లు, ఆర్టీసి బస్సులలో నగదు తీసుకువెళ్ళడం, నాలుగు చక్రాల, ద్విచక్ర వాహనాల స్పేర్ టైర్లలో నగదు నోట్లు కుక్కడం వంటి వినూత్న మార్గాలను పార్టీలు అనుసరిస్తున్నాయి. హైటెక్ రూట్ లో పోతూ రాజకీయ నాయకులు స్థానిక పార్టీ మద్దతుదారునికి ఆన్ లైన్ లో కూడానగదు బదలాయింపునకు పూనుకుంటున్నాయి. స్వయం సహాయక గ్రూపుల (ఎస్ హెచ్ జి) సభ్యుల అకౌంట్లలోకి నేరుగా నగదు డిపాజిట్ చేస్తుండడం అవి అనుసరిస్తున్న మరొక పద్ధతి.
భారీ మొత్తంలో నగదును తీసుకువెళ్లే ప్రయాణికుని కనుగొనడం పోలీసులకు కష్టం కనుక ఆర్టీసి బస్సులు కూడా పార్టీలకు ఉపయోగపడుతున్నాయి. 'జిల్లాలలో ఇలా చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదుతో కూడిన బ్యాగ్ ను తీసుకువెళ్లే పార్టీ కార్యకర్త సులభంగా భారీ లగేజి మోసే ప్రయాణికులతో కలగలిసి పోగలరు' అని ఒక పోల్ మేనేజర్ చెప్పారు. డబ్బు అక్రమ రవాణాకు అంబులెన్స్ కూడా చక్కగా ఉపయోగపడుతున్నది. పోలీసులు ఆదివారం రాత్రి ఒక అంబులెన్స్ లో రూ. 2.3 కోట్ల నగదును చూసి అప్రతిభులయ్యారు. హైదరాబాద్ లోను, శివారు ప్రాంతాలలోను నగదను కొద్ది మొత్తాలలో టైరు ట్యూబులలో కుక్కి చేరవేస్తున్నారు.
'మొదటి సందర్భంలో నోట్ల విలువను బట్టి కొద్ది పరిమాణంలో డబ్బును విభజిస్తున్నారు. పార్టీల కార్యకర్తలు అనేక మంది వాటిని తీసుకువెళ్ళి నియోజకవర్గంలో ఒక స్థానిక నాయకుని ఇంటిలో అందజేస్తారు. ఆతరువాత వోటర్లకు చీటీలు పంపిణీ చేస్తారు. వారు ఆ స్థానిక నాయకుని ఇంటిలో ఆ చీటీలు ఇచ్చి డబ్బు తీసుకుంటారు. ఈ విధంగా ఎక్కడా పోలీసుల చేతుల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు వెళ్ళదు' అని ఒక నాయకుడు చెప్పారు. నగదు కట్టలను ట్యూబులలోకి కుక్కి, ఆ ట్యూబులను నాలుగు చక్రాల, ద్విచక్ర వాహనాల స్పేర్ టైర్లలోకి ఎక్కించడం మరొక పద్ధతి. 'చిన్న మొత్తాలలో డబ్బును రవాణా చేయడం,స వాటిని వాహనాలలో రహస్యంగా దాచడం పట్టణ ప్రాంతాలలో, ముఖ్యంగా హైదరాబాద్ లో జరుగుతోంది. తెలివైన నాయకులు కొందరు డబ్బును అక్రమ రవాణా కోసం తమ వాహనాలలో మెకానిక్ ల సాయంతో రహస్య అరలు తయారు చేయిస్తున్నారు' అని ఒక నాయకుడు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 14 April, 2009
|