రెండోవిడత మూడు ముక్కలాటే!
హైదరాబాద్: రాష్ట్రంలో మహాకూటమి ప్రభావం ఉండని మలివిడత ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మధ్యనే పోటీ ప్రధానంగా ఉంటుంది. రాయలసీమలోని ఎనిమిది లోక్ సభ, 52 అసెంబ్లీ స్థానాలకు, కోస్తాలోని 20 లోక్ సభ, 140 అసెంబ్లీ స్థాలకు ఈ నెల 23న ఎన్నికలు జరుగనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజారాజ్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కొంతవరకు ఉండవచ్చు. ప్రజారాజ్యం గెలిచే అవకాశాలు లేని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి పడే ఓట్ల వల్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో ఎవరికి నష్టం కలుగుతుందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అధికారంకోసం 75 నుంచి 80 స్థానాల్లో గెలుపొందాల్సి వుంటుందని కాంగ్రెస్, తెలుగుదేశం భావిస్తున్నాయి.
గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ గెలుపొందగా, ఈ సారి ప్రజారాజ్యం రంగంలో ఉన్నందువల్ల అన్ని స్థానాలను గెలుచుకోవడం సాధ్యం కాదు. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ సారి 20 నుండి 25 స్థానాలు దక్కించుకోగలమని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రజారాజ్యం వల్ల కాంగ్రెస్ ఓట్లకే భారీగా గండిపడుతుందని, మెజారిటీ స్థానాలు తమకేనని తెలుగుదేశం ఆశిస్తోంది. అయితే, చిరంజీవి ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లోనే అధికంగా ఉంటుంది కాబట్టి అక్కడ మెజారిటీ తమదేనని ప్రజారాజ్యం పార్టీ ధీమాగా వుంది.
Pages: 1 -2- News Posted: 18 April, 2009
|