అందరి చూపు తూగోపైనే
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తారా అని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఊపిరి బిగపట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జిల్లాలో ఏ పార్టీకి మెజారిటీ లభిస్తే రాష్ట్రం మొత్తం మీద ఆ పార్టీకి మెజారిటీ లభించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది క్రమంగా ఒక సెంటిమెంట్ గా మారిపోయింది.
1983 నుంచి జరిగిన ఆరు శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) 1983, 1985, 1994, 1999 ఎన్నికలలో మెజారిటీ సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక కాంగ్రెస్ 1989, 2004 ఎన్నికల అనంతరం అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2004 ఎన్నికలలో తూర్పు గోదావరి జిల్లాలో 18 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా టిడిపికి రెండు సీట్లు, ఇండిపెండెంట్ కు ఒక సీటు లభించాయి. 1999 ఎన్నికలలో టిడిపి 18 సీట్లను, కాంగ్రెస్, బిజెపి చెరి ఒక సీటును గెలుచుకున్నాయి. ఈ పర్యాయం ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) ఆవిర్భావంతో సమీకరణాలు మారిపోయాయి. దాని ప్రధాన ప్రత్యర్థి పార్టీలు రెండూ అది తమ తమ ఓటు బ్యాంకులను కొల్లగొట్టగలదని భయపడుతున్నాయి.
Pages: 1 -2- News Posted: 20 April, 2009
|