పట్టు వీడని ఫ్యాక్షన్ భూతం
కడప : కడప జిల్లా ఫ్యాక్షన్ కు నిలయమైన ఒక గ్రామంలో తన భర్త హత్య జరిగి నెలలు గడచినా ఒక వితంతువు ఇంకా తన నుదుట బొట్టు పెట్టుకుంటున్నది. మరొక వితంతువు తన జుట్టును ఎన్నడూ ముడివేసుకోదు. 'నా భర్త హంతకుల రక్తంతో నా కేశాలను కడిగిన' తరువాతే జూట్టు ముడి వేసుకుంటానని ఆమె చెబుతున్నది.
కడప జిల్లా అంతటా అటువంటి వితంతువులు ఎందరో ఉన్నారు. వారిని చూసిన తరువాత మహాభారతంలో సన్నివేశాలు విడ్డూరంగా కనిపించకపోవచ్చు. ఈ జిల్లా వాసులకు దీని అర్థం తెలుసు. కాని వారికి ఈ సంకేతాలకు అర్థం ఏమిటో తెలుసు కనుక దీని గురించి వారు అందరిలోను మాట్లాడరు. కాని పోలీసు సిబ్బందికి మాత్రం రానున్న కల్లోలానికి కచ్చితంగా ఇవి సూచికలు.
రెండవ దశ ఎన్నికలకు ఇంకా రెండు రోజుల వ్యవధి కూడా లేకపోవడంతోను, హింసాకాండ జరిగే ప్రమాదం ఉందని గూఢచారి నివేదికలు సూచిస్తుండడంతోను, పోలీసులు దాదాపు 72 గ్రామాలలో నిఘాను మరింత పెంచారు. నలుగురు మహిళల గురించే గూడచారి సంస్థ నివేదికలో పేర్కొనడం గమనార్హం. వారిలో ఒక మహిళ తన ఇంటి బయట నిలబడి, తన తొడలు చరుస్తూ 'వాళ్ళని నరికి పడేస్తాం' అని పొరుగు ఇంటివారితో బిగ్గరగా అంటుండడం కనిపించింది.
'నుదుట బొట్టు పెట్టుకునే వితంతువు కొన్ని నెలల క్రితం జరిగిన తన భర్త దారుణ హత్యకు తన కుటుంబ సభ్యులు ప్రతీకారం తీర్చుకునేంత వరకు అలాగే బొట్టు పెట్టుకోవాలని నిశ్చయించుకున్నది' అని కొన్ని వర్గాలు తెలియజేశాయి.
Pages: 1 -2- News Posted: 21 April, 2009
|