స్థానికాంశాలకు గుడ్ బై?
విజయవాడ : అభ్యర్థులు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా తమ ప్రచారంలో స్థానిక అంశాల ప్రస్తావనకు పూర్తిగా స్వస్తి చెప్పిన ఎన్నికలు ఇటీవలి కాలంలో ఇవే మొదటివి కావచ్చు. వాస్తవానికి, ప్రభుత్వం పట్టించుకోని స్థానిక అంశాలను ప్రధానంగా ప్రస్తావించడంలో ప్రతిపక్షాల వైఫల్యాన్ని ఇది సూచిస్తున్నది. గడచిన ఐదు సంవత్సరాలలో తమ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాల గురించి కాంగ్రెస్ అభ్యర్థులు గొప్పగా చెప్పుకుంటుండగా ప్రతిపక్షాల అభ్యర్థులు తమ తమ పార్టీలు ప్రకటించిన పథకాల ధ్యాసలో పడిపోయినట్లున్నారు.
'తమ మేనిఫెస్టోలలో ప్రకటించిన రాయితీల గురించి ప్రధానంగా ప్రచారం చేయడంలో తప్పేమీ లేదు. కాని స్థానిక సమస్యలను లేవనెత్తి జనానికి దగ్గర కావడానికి లభించిన అమూల్యావకాశాన్ని ప్రతిపక్ష అభ్యర్థులు చేజార్చుకున్నారు' అని నీటిపారుదల శాఖకు చెందిన మాజీ ఇంజనీర్ విశ్వేశ్వరరావు అభిప్రాయం వెలిబుచ్చారు. అభ్యర్థులు పట్టించుకుంటారని జనం ఆశిస్తున్న అంశాలు ఎన్నో ఉన్నాయని, కాని తమకు పరిస్థితులను సానుకూలం చేసే అవకాశం ఆ అంశాలకు ఉన్నదనే సంగతిని వారిలో ఎవ్వరూ గ్రహించలేదని ఆయన పేర్కొన్నారు.
ఉదాహరణకు, ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విజయవాడ నగరానికి వచ్చిన ప్రతిసారి చేస్తున్న వాగ్దానాలలో అత్యంత ముఖ్యమైనవి కృష్ణా డెల్లా ఆధునికీకరణ, బుడమేరు మళ్ళింపు. కాని అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు టెండర్ దశలోనే ఉండగా జిల్లా అధికార యంత్రాంగం బుడమేరు మళ్ళింపు పథకాన్ని గందరగోళంగా మార్చింది.
Pages: 1 -2- News Posted: 21 April, 2009
|