బెడ్ ల కోసం రోగుల క్యూ
హైదరాబాద్ : ప్రతి సంవత్సరం అడ్మిషన్ల కాలంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, కంపెనీల సిఇఒల నుంచి వచ్చే కాల్స్ కు సమాధానం చెప్పలేక సతమతమయ్యే స్కూల్ ప్రిన్సిపాల్స్ వలె హైదరాబాద్ నగరంలోని 5 నక్షత్రాల ఆసుపత్రుల ఉద్యోగులు కూడా అటువంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. పలుకుబడి గల వ్యక్తుల నుంచి ఆసుపత్రి బెడ్ కోసం అదే పనిగా వారికి కాల్స్ వస్తున్నాయి. వారి దురదృష్టవశాత్తు ఈ అడ్మిషన్ల సీజన్ ఏడాది పొడుగునా ఉంటుంది.
నగరంలోని ఆసుపత్రులు బెడ్ ల కొరతతో సతమతం అవుతున్నాయి. రోగులను క్యూలో నిలబడవలసిందిగా ఆసుపత్రుల నిర్వాహకులు తరచుగా కోరుతున్నారు. 'నాకు జనం నుంచి (అడ్మిషన్ కోసం) వారానికి నాలుగైదు కాల్స్ వస్తుంటాయి. వారిని కొంత కాలం వేచి ఉండవలసిందిగా కోరుతున్నాం' అని ఒక కార్పొరేట్ ఆసుపత్రి సీనియర్ ఉద్యోగి ఒకరు తెలియజేశారు. 'అత్యవసర కేసు అయినట్లయితే రోగిని చేర్చుకుని ఎమర్జెన్సీలోనే బెడ్ కేటాయిస్తున్నాం. కాని సర్జరీకి తేదీ నిర్ణయించవలసి వస్తే మాత్రం రోగులను కొంత కాలం ఆగవలసిందిగా కోరుతున్నాం' అని ఆ ఉద్యోగి తెలిపారు.
ఇటీవలి కాలంలో కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరగడం వల్ల కొంత, ఆరోగ్యశ్రీ పథకం వల్ల చాలావరకు డిమాండ్ ను తట్టుకోవడానికి బాగా తక్కువగా జనం ఉపయోగించుకునే డీలక్స్ రూమ్ బెడ్ లను తగ్గించి, రెగ్యులర్ లేదా మధ్య తరహా రోగులకు వాటిని కేటాయిస్తున్నామని ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. ఇతర కేసులలో సింగిల్ రూమ్ లను ఎక్కువ మంది రోగులకు వసతి కల్పన కోసం షేరింగ్ రూమ్ లుగా మారుస్తున్నట్లు వారు తెలిపారు.
Pages: 1 -2- News Posted: 23 April, 2009
|