తగ్గిన 'మహా' ఉత్సాహం
హైదరాబాద్ : మహా కూటమికి రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో 200 పైచిలుకు సీట్లు లభిస్తాయని ఆదిలో ఎంతో ఉత్సాహపడిన తెలుగు దేశం పార్టీ (టిడిపి)లో ఆ ఉత్సాహం క్రమంగా అంతరిస్తున్నది. ప్రభుత్వం స్థాపనకు వీలుగా తనకే మెజారిటీ వస్తుందని ఇప్పటికీ ఆశపడుతున్నా ప్రధాన ప్రతిపక్షం టిడిపి ప్రత్యామ్నాయ పరిస్థితులను కూడా అధ్యయనం చేయడానికి సిద్ధపడుతున్నది.
మహా కూటమికి ఒకవేళ సాధారణ మెజారిటీ రాకపోయినట్లయితే, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)కి మద్దతు ఇవ్వడానికి గాని, ఆ పార్టీ మద్దతు తీసుకోవడానికి గాని టిడిపి సుముఖంగా లేదు. ప్రతిపక్ష స్థానాలలోనే కూర్చొనడానికి కూడా సిద్ధమేనని టిడిపి సూచిస్తున్నది.
పార్టీ ఈ విషయమై ఒక నిర్ణయానికి వచ్చిందా అని 'ఎక్స్ ప్రెస్' విలేఖరి ప్రశ్నించినప్పుడు టిడిపి నాయకుడు ఒకరు సమాధానం ఇస్తూ, సోమవారం సమావేశం అవుతున్న పొలిట్ బ్యూరో పరిస్థితిని సమీక్షిస్తుందని చెప్పారు.
'తెలంగాణ అంశం, తీర్మానం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చేస్తున్న డిమాండ్, ఇతరుల మద్దతు తీసుకోవడం వంటి అంశాలన్నిటినీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించవచ్చు' అని టిడిపి ప్రధాన కార్యదర్శి ఒకరు తెలియజేశారు.
టిడిపి ప్రధానంగా రెండు విషయాలను పరిశీలిస్తున్నది. వాటిలో మొదటిది - పిఆర్పీ కాంగ్రెస్ పార్టీతో కలసి సాగవచ్చు. రెండవది దీనికి సంబంధించినదే. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో పిఆర్పీ అధ్యక్షుడు చిరంజీవిపై విమర్శలు చేయడానికి వెనుకాడలేదు. ఆయన చిరు పార్టీని ఒక రైలులా అభివర్ణించారు. ఇంజన్ ను ఎలా నడపాలో డ్రైవర్ కు తెలియనందున నాయకులు అందరూ రైలు దిగి వెళ్ళిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 27 April, 2009
|