చంద్రబాబుకు పిఎం ఛాన్స్?
హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలో మరోసారి చక్రం తిప్పనున్నారు. యుపిఎ, ఎన్డిఎ లు అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించకపోవడంతోను, మూడో ఫ్రంట్ అంతర్గత విబేదాలతో సతమతం అవుతుండడంతోను, ఎన్నికల అనంతరం నాలుగో కూటమి ఏర్పాటు తప్పదని తేలిపోయింది. 1980లలో కేంద్రస్థాయిలో తెలుగుదేశం కీలకపాత్ర పోషించింది. అప్పుడు అధికారం చేపట్టిన ఫ్రంట్ ఏర్పాటులో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ప్రధాన పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగానే ఫ్రంట్ అధికారం చేపట్టగా, విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నేషనల్ ఫ్రంట్ కు తెలుగుదేశం కన్వీనర్ గా వ్యవహరించింది. అయితే తెలుగుదేశం పార్టీకి ఎంపిల బలం తగినంతగా లేనందు వల్ల ఎన్టీఆర్ కు ప్రధాని పీఠం దక్కలేదు. ఆ తరువాత కూడా కేంద్రంలో పెత్తనం చెలాయించే అవకాశం తెలుగుదేశం పార్టీకి రెండుసార్లు వచ్చింది. కాని రాష్ట్ర రాజకీయాల మీద పట్టు జారిపోతుందన్న ఆలోచనతో చంద్రబాబు ఆ అవకాశాలను వదులుకున్నారు.
ఈసారి జాతీయస్థాయిలోని కాంగ్రెసేతర పార్టీలో పాటు అంతర్జాతీయ రాజకీయవేత్తల మద్దతు వున్న ఏకైక నాయకుడుగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్, బిజెపి లలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు గెలుచుకో లేకపోతున్నాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతున్నాయి. గత దశాబ్దంగా ఆ రెండు పార్టీలతో జతకట్టిన ప్రాంతీయ పార్టీలు, వాటి ఆధిపత్యానికి తలవంచక, క్రమంగా వాటికి దూరమయ్యాయి. కాంగ్రెస్ తరఫున ప్రధానిగా మన్మోహన్ సింగ్ ను ప్రాంతీయ పార్టీలు ఆమోదించడం లేదు. ఎన్డీఎ కూటమిలోని పార్టీలు కూడా అద్వానీ అభ్యర్ధిత్వానికి అంగీకరించడం లేదు. వాజ్ పేయి వంటి మితవాదికి మద్దకు ఇచ్చిన పార్టీలు అద్వానీకి అతివాదిగా ముద్రవేశాయి.
Pages: 1 -2- News Posted: 27 April, 2009
|