'సోనియా'ఓటర్ల నిరాసక్తత
లక్నో : నాయకుల స్థాయి పెరిగిన కొద్దీ వారిపై ఓటర్ల ఆసక్తి తగ్గుతుందనేది పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిద్ధాంతం. గాంధి కుటుంబ సభ్యులను ఒక మారు చూసేందుకు వారి ఎన్నికల సభలు, ర్యాలీల వద్ద జనం అధిక సంఖ్యలో సమీకృతం అవుతుంటారు. దారిపొడుగునా బారులు తీరుతుంటారు లేదా చెట్లు, ఇళ్ళ డాబాలపైకి చేరుతుంటారు.కాని జంట నియోజకవర్గాలు అమేథి, రాయబరేలిలలో తమ ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల వరకు వెళ్ళడానికి చాలా మంది వెనుకాడారు. రాహుల్ నియోజకవర్గం అమేథిలో45 శాతం మాత్రమే పోలింగ్ నమోదై కాంగ్రెస్ వారు నిరాశ చెందిన వారం రోజుల తరువాత సోనియా గాంధి నియోజకవర్గం రాయబరేలిలో 46 శాతం ఓటింగ్ నమోదు కావడం ఆ పార్టీ వారికి ఏమాత్రం మింగుడుపడడం లేదు. 2009 ఎన్నికలలో మొదటి కుటుంబం పేరు గిన్నెస్ ప్రపంచ రికార్డులలో నమోదు కావాలని కాంగ్రెస్ వారు ఆకాంక్షిస్తుండగా బాగా తక్కువగా ఓటింగ్ నమోదు కావడం వారిని అసంతుష్టికి గురి చేసింది.
రాయబరేలిలో 70 శాతం ఓట్లు నమోదవుతాయని నియోజకవర్గంలో పార్టీ ఎన్నికల ఇన్ చార్జి కిషోరి లాల్ శర్మ జోస్యం చెప్పారు. ఆ సంఖ్య మరీ అతి అనిపించవచ్చు. ప్రియాంక గాంధి వాద్రా రోజుకు 15 నుంచి 20 వరకు సభలలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ఈ విధంగా అంచనా వేశారు. వాస్తవానికి ప్రియాంక వారానికి 100 పైగా సభలలో ప్రసంగించి ఒక విధంగా రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 15న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి ర్యాలీ జరిగిన మైదానం జనంతో కిక్కిరిసిపోవడం, సభికుల ఉత్సాహభరిత స్పందన పార్టీ వారి ఆశలను పెంపొందించింది. 'అందువల్ల 46 శాతం కొంత గౌరవప్రదమైనదే. అయితే, నిరాశ కూడా కలిగిస్తున్నది' అని కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు గురువారం వ్యాఖ్యానించారు. 'మండే ఎండలు, కూలీల సీజనల్ వలసలు, వోటర్ల జాబితాలలో లోపాలు ఈసారి వోటింగ్ శాతం పడిపోవడానికి కారణమైంది' అని శర్మ చెప్పారు.
లాభసాటి పదవుల వివాదంపై తన సభ్యత్వానికి రాజీనామా చేసి సోనియా గాంధి తిరిగి పోటీ చేసినప్పుడు 2006 మే నెలలో 42 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు కావడంతో పోలిస్తే ఇది కొంత వరకు మెరుగేనని రాయబరేలిలో సోనియా సహచరుడు మరొకరు వ్యాఖ్యానించారు. ఇయినప్పటికీ 1999లో సోనియా గాంధి తొలిసారిగా అమేథి నుంచి పోటీ చేసినప్పుడు నమోదైన 57.46 శాతం ఓటింగ్ తో పోలిస్తే మాత్రం ఇది బాధ కలిగిస్తుంది. ఐదు సంవత్సరాల తరువాత ఆమె రాయబరేలికి మారినప్పుడు 48.27 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే, ప్రతి ఎన్నికలకు ఈ ఓటింగ్ శాతం పడిపోతూన్నది. 1999 గణాంకాలకు సానుకూల వాతావరణం కారణమని పార్టీ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికలు నవంబర్ లో జరిగి ఉన్నట్లయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేదని కొందరు వాదిస్తున్నారు. కాకపోతే పార్టీలో కొందరు 'రాయబరేలి వాసుల నమ్మకద్రోహం' పట్ల కోపంతో ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 1 May, 2009
|