కృష్ణాలో అంతా కాయ్ రాజాలే!
విజయవాడ: రాకీయంగా అత్యంత చైతన్యవంతమైన కృష్ణాజిల్లాలో ఈ సారి ఎన్నడూలేని విధంగా ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాలతోపాటు ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్ధుల విజయాలపై 50 కోట్ల రూపాయలకు పైనే బెట్టింగులు జరిగినట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా వియవాడ లోక్ సభ నియోజకవర్గం, గుడివాడ, పెనమలూరు, విజయవాడ తూర్పు, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా బెట్టింగులు జరిగినట్టు తెలిసింది. గుడివాడలో రాష్ట్ర మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ వుంది. ఇక్కడ ఓటు ధర కూడా భారీగానే పలికింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కేవలం ఈ నియోజకవర్గంపైనే 3 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్ జరిగిందని తెలిసింది.
కొడాలి నాని తన ప్రాబల్యాన్ని నిలుపుకుంటారా, లేక కొత్తగా వచ్చిన పిన్నమనేనికు ఓటర్ల మద్దతు ఏ మేరకు లభించింది, మరీ ముఖ్యంగా మంత్రి తండ్రి పిన్నమనేని కోటేశ్వరరావు మంత్రాంగం ఎంతవరకూ పని చేసిందనే అంశాలను బేరీజు వేసుకుని మరీ బెట్టింగులు కడుతున్నారు. అయితే అభ్యర్ధి విజయం పైనే పందేలు వేస్తున్నారు తప్ప మెజారిటీల ఊసెత్తడం లేదు. పెనమలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కెపి సారథి, తెలుగుదేశం అభ్యర్ధిగా చలసాని వెంకటేశ్వరరావు, ప్రజారాజ్యం అభ్యర్ధిగా ధనేకుల మురళీమోహన్ పోటీలో వున్నారు. ఇక్కడ క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్ధులకు సెంత పార్టీల్లోనే వెన్నుపోు రాజకీయాలు నడిపించినట్టు బాహాటంగానే చెబుతున్నారు. ఫలితంగా అభ్యర్ధుల విజయావకాశాలపై ఉత్కంఠ నెలకొంది.
Pages: 1 -2- News Posted: 4 May, 2009
|