పోస్టల్ బ్యాలట్లపై కన్ను
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికలు సుమారు రెండు వారాల క్రితం ముగియడంతో ఇక నిరీక్షణ మే 16 నాటి ఎన్నికల ఫలితాల ప్రకటన కోసమేనని ఎవరైనా భావిస్తుంటే వారు మరొకసారి ఆలోచించాలి. ముక్కోణపు పోటీల కారణంగా పెక్కు అసెంబ్లీ నియోజకవర్గాలలో నువ్వా నేనా అనే రీతిలో పోటీ జరిగి ఓట్లు కూడా అదే రీతిలో పడి ఉండవచ్చునని భయపడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు పోస్టల్ బ్యాలట్ల 'కొనుగోలు' కోసం ధన వస్తు రూపేణా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా పోస్టల్ బ్యాలట్లు ఉన్నాయి. రక్షణ సిబ్బంది, ఎన్నికల విధులలో ఉన్న భద్రతా సిబ్బంది, టీచర్లు, డ్రైవర్లు, ఎన్నికల విధుల కోసం ఉపయోగించుకున్న ఇతర సిబ్బంది పోస్టల్ బ్యాలట్ల ద్వారా వోట్లు వేయడానికి అర్హులు. ఎన్నికల కమిషన్ నుంచి పోస్టల్ బ్యాలట్లు అడిగి తీసుకోవడానికి ఏప్రిల్ 22 చివరి తేదీ కాగా, అలా పూర్తి చేసిన పోస్టల్ బ్యాలట్లను ఓట్ల లెక్కింపు తేదీ మే 16న ఉదయం 8 గంటల వరకు కమిషన్ స్వీకరిస్తుంది. హంగ్ సభ ఏర్పడే సూచనలు కనిపిస్తుండడంతోను, పెక్కు నియోజకవర్గాలలో పోటీ ఉధృతంగా సాగడంతోను అభ్యర్థులు పోస్టల్ బ్యాలట్లను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు.
అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం, పోస్టల్ బ్యాలట్లను కైవసం కోవడానికి పోటీ రాయలసీమలో గరిష్ఠ స్థాయిలో సాగుతోంది. ఆ ప్రాంతంలో ప్రధానమైన ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు కాంగ్రెస్ సిఎం డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి పోటీ చేశారు. ఒక్క కడప జిల్లాలోనే 19.522 పోస్టల్ బ్యాలట్లను జారీ చేశారు. వాటిలో 10,371 బ్యాలట్లను ఎన్నికల విధుల కోసం నియోగించిన ప్రభుత్వ ఉద్యోగులకు పంపిణీ చేశారు. వైఎస్ సొంత జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో రక్షణ శాఖ ఉద్యోగులైన 846 మంది ఓటర్లు ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 5 May, 2009
|