డి బ్లాకే అక్రమ కట్టడం!
హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించిన డి బ్లాక్ భవనానికి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి బిల్డింగ్ అనుమతి ముందుగా పొందనిదని తెలియవచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్, మూడంతస్తులు ఉన్న ఆ భవనాన్ని రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బి) 2003లో రూ. 22.50 కోట్ల వ్యయంతో నిర్మించింది.ఈ కాంట్రాక్టును ఎల్ అండ్ టి సంస్థకు ఈ శాఖ ఇచ్చింది.
భవన నిర్మాణ ఉప నిబంధనల ప్రకారం, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కూడా ముందుగా అనుమతి పొందాలి. డ్రాయింగ్ లు, ఇతర సంబంధిత పత్రాలను సమర్పించిన అనంతరం సంబంధిత ప్రాంత పురపాలక సంస్థ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. అయితే, ప్రభుత్వ భవనాలకు భవనం ఫీజు, డెవలప్ మెంట్ చార్జీలు, ఇతర ఫీజులు చెల్లించకుండా మినహాయింపు ఇస్తారు. సచివాలయంలో నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తుండే రోడ్లు భవనాల శాఖ 2002లో అప్పటి హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని ఉండవలసింది.
ఒక పత్రిక ప్రతినిధి ఈ విషయమై సంప్రదించినప్పుడు రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ టి. బాబూ రాజ్ 'సచివాలయ భవనాలకు అనుమతి పొందవలసిన ఆవశ్యకత లేదు' అని తొలుత చెప్పారు. కాని ఆతరువాత ఆయన తన మాటలు మార్చివేస్తూ, ' డి బ్లాక్ నిర్మాణానికి కాంట్రాక్టును ఎల్ అండ్ టికి ఇచ్చినప్పుడు కావలసిన అనుమతులన్నిటినీ పొందవలసిందిగా ఆ సంస్థను రోడ్లు భవనాల శాఖ కోరింది' అని తెలియజేశారు. కాని జిహెచ్ఎంసి అధికారుల సమాచారం ప్రకారం, ఆర్ అండ్ బి ముందుగా అనుమతి కోసం దరఖాస్తూ చేయలేదు. 'బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్' (బిపిఎస్) కింద క్రమబద్ధీకరణనూ కోరలేదు. ఈ పథకాన్ని క్రితం సంవత్సరం ప్రకటించారు.
Pages: 1 -2- News Posted: 9 May, 2009
|