ఫిరాయింపుదారుల ఓటమి
హైదరాబాద్ : పరిణతి చెందిన ఓటరు ఫిరాయింపుదారులకు గట్టి గుణపాఠమే నేర్పినట్లు2009 ఎన్నికల ఫలితాల వల్ల విదితం అవుతున్నది. సీటు కోసం తమ విధేయతలను చులాగ్గా మార్చుకున్న ఫిరాయింపుదారులకు టిక్కెట్లు కేటాయించిన పార్టీల జాబితాలో ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)దే అగ్ర తాంబూలం. అయితే, ఓటర్లు తమను ఎవరూ వంచించలేరని నిరూపించారు.
ప్రజారాజ్యం పార్టీలో టి. దేవేందర్ గౌడ్ పరాజితులు అందరిలోకి ప్రముఖుడు. ఆయన తెలుగు దేశం పార్టీ (టిడిపి)కి గుడ్ బై చెప్పి సొంత పార్టీ నవ తెలంగాణ పార్టీ (ఎన్ టిపి)ని స్థాపించి ఎన్నికలకు సరిగ్గా ముందుగా దానిని పిఆర్పీలో విలీనం చేసిన సంగతి విదితమే. ఆయన తాను పోటీ చేసిన రెండు స్థానాలలోను అంటే ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గంలోను, మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలోను ఘోరంగా ఓడిపోయారు.
టిడిపి నుంచి పిఆర్పీలోకి ఫిరాయించిన కోటగిరి విద్యాధరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, తమ్మినేని సీతారామ్, కిమిడి కళా వెంకటరావు, భూమా నాగిరెడ్డి, సి. రామచంద్రయ్య వంటి నాయకులను ఓటర్లు తిరస్కరించారు. విద్యాధరరావు ఉంగుటూరు నియోజకవర్గంలో మూడవ స్థానంలో నిలవగా సీతారామ్ ఆమదాలవలస నియోజకవర్గంలో బొడ్డేపల్లి సత్యవతి (కాంగ్రెస్) చేతిలో 16055 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కళా వెంకటరావు ఎచ్చెర్ల నియోజకవర్గంలో మూడవ స్థానం మాత్రమే పొందారు. అక్కడ కొత్తవాడైన కాంగ్రెస్ అభ్యర్థి నీలకంఠం గెలుపొందారు.
అదేవిధంగా నాగిరెడ్డి నంద్యాల నియోజకవర్గంలో మూడవ స్థానంలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.పి.వై. రెడ్డి విజయం సాధించారు. నాగిరెడ్డి మాదిరిగానే సి. రామచంద్రయ్య మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గంలో మూడవ స్థానం మాత్రమే పొందారు. అక్కడ టిడిపి అభ్యర్థి కె. నారాయణ గెలుపొందారు. అదేవిధంగా సరిగ్గా ఎన్నికలకు ముందు పిఆర్పీలోకి ఫిరాయించిన వంగవీటి రాధాకృష్ణ, బూరగడ్డ వేదవ్యాస్ వంటి కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఎలు కూడా మట్టి కరిచారు. రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో 847 ఓట్ల తేడాతో ఓడిపోగా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వేదవ్యాస్ మూడవ స్థానంతో సంతృప్తి పడవలసి వచ్చింది.
Pages: 1 -2- News Posted: 18 May, 2009
|