బీసీల్లో ఉత్సాహం
హైదరాబాద్ : కొత్తగా కొలువు తీరే మంత్రి వర్గంలో సామాజిక న్యాయం ఎప్పటిలాగే పాటిస్తామని డాక్టర్ వైఎస్ చేసిన ప్రకటన బడుగుల్లో ఆనందాన్ని నింపితే, ఆయా సామాజిక వర్గాల నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన వారిలో కొత్త ఆశలు కలిగాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 32 మంది వెనుక బడిన వర్గాల అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో సగం మంది కొత్త వారు కావడం విశేషం. అనుభవం రీత్యా తమకు అవకాశం వస్తుందని సీనియర్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో 45 మంత్రి పదవులు ఉండొచ్చని, దీని ప్రకారం 22 మందికి బిసిలకు అవకాశం ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు.
రాష్ట్రంలోని 23 జిల్లాల్లో కేవలం 13 జిల్లాల్లోనే కాంగ్రెస్ పార్టీ తరఫున బిసి ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. దీంతో మంత్రి పదవుల పంపకాల్లో బిసి అభ్యర్థుల మధ్య పోటీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి ప్రాతినిథ్యం బిసిలకు కాంగ్రెస్ తరఫున దక్కివుంటే బిసి సభ్యుల సంఖ్య పెరిగి వుండేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో కాంగ్రెస్ కు బిసి ఎమ్మెల్యేల ప్రాతినిథ్యమే లేదు. మిగిలిన 13 జిల్లాల నుంచే 32 మంది కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు.
Pages: 1 -2- News Posted: 19 May, 2009
|