కరుణ పాచిక పారుతుందా?
చెన్నై : కరుణానిధి ఇంటిలోనివారికి ప్రభుత్వం కన్నా కుటుంబమే మిన్న. 2004 ఎన్నికల అనంతర పరిస్థితులను పునరావృతం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో చేరబోమని బెదరించారు. మంత్రి పదవులపై గురువారం సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన చర్చలు విఫలమైన అనంతరం డిఎంకె అధినేత ఈ బెదరింపు ఎత్తు వేశారు. ఐదు సంవత్సరాల క్రితం తన పార్టీ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కూడా తమకు వాగ్దానం చేసిన మంత్రిత్వశాఖలు దక్కని కారణంగా కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇస్తామని డిఎంకె అధినేత ప్రకటించారు.
ఆనువంశిక పాలనలో ఉన్న, కాని ప్రథమ కుటుంబం ప్రభుత్వ పదవులకు దూరంగా ఉన్నట్టి కాంగ్రెస్ పార్టీ అప్పుడు వెనుకకు తగ్గింది. కాని ఈ పర్యాయం సొంతంగా 206 మంది ఎంపిలు ఉండడంతోను, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వంటి నేతలు మంత్రివర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉండడంతోను పరిస్థితి భిన్నంగా ఉన్నది. డిఎంకె మంత్రుల పేర్లు, కాంగ్రెస్ అంగీకరించిన వారి ర్యాంకులు, మంత్రిత్వశాఖల జాబితాతో 2004 మే నెలలో తాను జనార్దనరెడ్డి సంతకం చేసిన లేఖను కరుణానిధి ఇప్పుడు ప్రదర్శించారు.
కుటుంబం పట్ల కర్తవ్యదీక్షాపరుడైన, ప్రస్తుతం వీల్ చైర్ కు పరిమితమైన 86 సంవత్సరాల కరుణానిధి తనవారి కోసం గట్టిగా బేరసారాలు సాగించారు. తన పార్టీకి కనీసం ఎనిమిది మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన కోరారు. వాటిలో మూడు పదవులు తన కుటుంబ సభ్యులు - కుమారుడు ఎం.కె. అళగిరి, కుమార్తె కనిమొళి, మేనల్లుని కుమారుడు అంటే మనవడు దయానిధి మారన్ లకు దక్కవలసి ఉంటుంది. వారే కనుక ప్రభుత్వంలో చేరి ఉంటే, ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సభ్యులు కేంద్రంలో ఏ మంత్రి మండలిలోనైనా భాగం కావడమనేది ఇదే మొదటిసారి అయి ఉండేది.
తన కుటుంబంలో ఆంతరంగికంగా వస్తున్న డిమాండ్లు తీర్చడం తప్పనిసరి కావడం వల్ల కావచ్చు టి.ఆర్. బాలు, ఎ. రాజా వంటి ఇతర ఎంపిలకు కూడా అవకాశం కల్పించడానికి, బంధుప్రీతి ఆరోపణలు రాకుండా చూసుకోవడానికి కరుణానిధి మరిన్ని మంత్రి పదవులు కోరవలసి వచ్చింది. పూర్వపు ప్రభుత్వంలో బాలు (నౌకాయాన, రోడ్డు రవాణా, రహదారులు), రాజా (కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ప్రధానమైన మౌలిక వసతుల శాఖలను నిర్వహించారు. అయితే, తన కుటుంబ సభ్యులలో చివరికి ఒకరికైనా మంత్రి పదవిని కరుణానిధి ఇప్పించలేకపోతే ఆయన కుటుంబంలోనే తిరుగుబాటు ఎదుర్కొనవచ్చు.
Pages: 1 -2- News Posted: 22 May, 2009
|