తెలంగాణాపై సైలెన్స్!
హైదరాబాద్:'తెలంగాణా'ను వదిలించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సమైఖ్య వాదం విడిచి తెలంగాణా గానం ఆలపించడం వలన కోస్తా, రాయలసీమలలో పార్టీకి అపార నష్టం వాటిల్లిన నేపథ్యంలో క్రమంగా పార్టీని సమైఖ్య వాదం వైపు నడిపించాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణాపై పార్టీ నాయకులు ఎవరూ నోరు విప్పవద్దని బాబు పార్టీ నాయుకులకు హుకుం జారీ చేశారు.
సమైక్యాంధ్రను కాంక్షిస్తూ.. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదమే మళ్లీ ఆ పార్టీలో మారు మోగనుందా? తెలం గాణ పల్లవి ఎత్తుకున్నందుకే ఎన్నికల సముద్రంలో పార్టీ పడవ మునిగి పోయిందా? బయటికి ఏమీ చెప్పక పోయినా.. టీడీపీ నేతల మనస్సులను ఇప్పుడు అంతర్లీనంగా తొలస్తున్న ప్రశ్నలివే. టీడీపీకి కంచుకోటగా ఉన్న కోస్తా్రంధ, రాయలసీమల్లో పార్టీ ఓటమికి కారణాలేమైనప్పటికీ తెలంగాణ వాదాన్ని తలకెత్తుకోవడం వల్లే గట్టి ఎదురుదెబ్బ తగిలిందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ప్రత్యేక వాదాన్ని బలంగా వినిపిస్తున్న టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టు కున్నా తెలంగాణలో కూడా బొటాబొటి సీట్లే గెలుపొందడాన్ని వారు ఈ సంద ర్భంగా ఉదహరిస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోక పోవడం వల్ల ఓడామని, ఈ సారి పొత్తుపెట్టుకుని ఓడిపోయామని తెలంగాణాకు చెంది న సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 22 May, 2009
|