వైఎస్ కు కత్తి మీద సాము!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కత్తి మీద సాము చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయవలసి ఉన్న తన కొత్త మంత్రివర్గం రూపకల్పన కోసం అనుభవజ్ఞులు, కొత్తవారు, కులాల సమీకరణాలు మధ్య సమతూకం పాటించడానికి ఆయన కసరత్తు చేస్తున్నారు.
కొత్త మంత్రుల జాబితాకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి ఆమోదముద్ర పొందడానికై డాక్టర్ రాజశేఖరరెడ్డి తన మిత్రుడు, ఎంపి డాక్టర్ కె.వి.పి. రామచంద్రరావుతో కలసి శనివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఆయన ఢిల్లీ వెళ్ళడం వారం రోజులలో ఇది నాలుగవ సారి. డాక్టర్ రాజశేఖరరెడ్డి ఆదివారం మధ్యాహ్నం తరువాత సోనియా గాంధితో సమావేశం కావడానికి ముందు పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి వీరప్ప మొయిలీని కలుసుకుంటారు.
శుక్రవారం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొయిలీ డాక్టర్ రాజశేఖరరెడ్డికి మరొక సమస్య తెచ్చిపెట్టారు. తన మంత్రుల బృందంలో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను చేర్చుకోవలసిందిగా ఆయనకు మొయిలీ సూచించారు. శ్రీనివాస్ తన సీటును గెలుచుకోలేకపోయారు కాి రాష్ట్రంలో పార్టీ విజయానికి సారథ్యం వహించారు. మొయిలీ సూచనపై డాక్టర్ రాజశేఖరరెడ్డి ఏ వ్యాఖ్యా చేయలేదని, సోనియా నిర్ణయానికి వదలివేశారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.
యువజనులు, అనుభవజ్ఞులైన ఎంఎల్ఎలో 25 మంది నుంచి 30 మంది వరకు సభ్యులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని డాక్టర్ రాజశేఖరరెడ్డి ముందు అనుకున్నారు. పాత మంత్రివర్గంలోని 18 మంది మంత్రులనందరినీ (జి 18ని) వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలలోని కొత్త వాస్తవాల దృష్ట్యా ఆయన తిరిగి చేర్చుకోకపోవచ్చు.
Pages: 1 -2- News Posted: 24 May, 2009
|