బలపడ్డ బడుగులు
హైదరాబాద్ : బడుగులు బలం పుంజుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు కనీసం రెండు సంవత్సరాల ముందు నుంచే ఊపందుకున్న బడుగులకు రాజ్యాధికారం ఆలోచన రాజకీయ పార్టీల అధినేతల దృక్పధాన్ని ప్రభావితం చేశాయి. దశాబ్దాలుగా రాష్ట్ర అత్యున్నత పదవులను అలంకరిస్తూ అధికారాన్ని చెలాయిస్తున్న సామాజిక వర్గాల చేతుల్లోంచి ఈసారి పగ్గాలను బడుగులు పట్టుకుపోతారేమోనన్న భయం ముప్పిరిగొంది. దానికి తోడు సామాజిక న్యాయం ఎజెండాగా పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం అధికారానికి దూరంగా వున్న వర్గాలకే ఈసారి అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామన్న ప్రచారం కూడా ప్రధాన పార్టీ అధినేతల ఆలోచనా సరళిని కొంతమేరకైనా మార్చగలిగింది. దాని ఫలితమే మొన్నటి తాజా ఎన్నికల్లో వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు చట్టసభకు మంచి సంఖ్యలోనే రాగలిగారు. అటు రాష్ట్ర అసెంబ్లీలోనూ, ఇటు లోక్ సభలోనూ అనుకున్న దానికంటే బలం పెంచుకున్నారు. ఎన్నికల చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈసారి డబ్బు ప్రభావం విపరీతంగా కనిపించింది. అయినా, బీసీలు అగ్ర కులాలపై విజయం సాధించి, పార్టీ నాయకత్వాలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి విశ్వాసాన్ని నిలబెట్టారు.
అసెంబ్లీలో అన్ని పార్టీలకు చెందిన 57 మంది, పార్లమెంటుకు 10 మంది బీసీలు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది ఎన్నిక కావడం విశేషం. కాంగ్రెస్ లో ఏడుగురు ఎంపిలు, 33 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. గెలిచిన 10 మంది ఎంపిలలో కాంగ్రెస్ నుండి గౌడ-2, యాదవ-1, తూర్పుకాపు-1, వెలమ-1, కాళింగ-1, లింగాయత్-1 ఎన్నికయ్యారు. టిడిపి నుంచి గెలిచిన ఆరుగురిలో గౌడ-1, పద్మశాలి-1, టిఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపిలు గెలవగా బొందిలి నుంచి ఒకరు ఎన్నికయ్యారు.
Pages: 1 -2- News Posted: 25 May, 2009
|