ధృతరాష్ట్రుని కౌగిలి `దేశం'
హైదరాబాద్ : మహాభారతంలో ధృతరాష్ట్రుని కౌగిలికి ఓ ప్రత్యేకత ఉంది. అంధుడైన ధృతరాష్ట్రుని కౌగిలిలో చిక్కితే సరాసరి యమపురి ప్రయాణం తథ్యం. ఆయన కోపంతో కౌగిలించుకున్నా, ప్రేమతో ఆలింగనం చేసుకున్నా చావు తప్పదు. దుర్యోధనునికి సమవుజ్జీగా భీముడు ఉన్నాడని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు, భీముడ్ని హతమార్చడానికి ప్రేమగా కౌగిలిలోకి రమ్మని పిలిస్తే ఆపద్బాంధవుడు శ్రీకృష్ణుడు ఉపాయంగా భీముడ్ని రక్షించడం భారతంలో చదువుకున్నాం. కానీ పాపం ఆంధ్రరాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ, సిపిఐ, సిపిఎం, తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీలను రక్షించేందుకు ఏ బాంధవుడూ లేకపోయాడు. ఇంతకూ విషయం ఏమిటంటే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏపార్టీని అక్కున చేర్చుకుంటే అక్కడితో ఆ పార్టీ పని సరని కొత్త సెంటిమెంటు ఒకటి ప్రచారంలోకి వచ్చింది. సీట్లెక్కువ గెలుచుకుందామనో, రాజకీయ ప్రయోజనం పొందుదామనో తెలుగుదేశం పార్టీతో మిత్రత్వం చేస్తే ఆ తరువాత నామరూపాలుకూడా మిగలటం లేదని రాజకీయ జోతిష్యులు నొక్కి వక్కాణిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రేమగా కౌగిలించుకున్నా అది మిత్రపక్ష పార్టీల పాలిట ధృతరాష్ట్రుని కౌగిలిగా మారుతోందని వివరిస్తున్నారు. దానికి గడిచిన ముప్పైఏళ్ళ ఆంధ్రదేశ రాజకీయ చరిత్రను సోదాహరణంగా వివరిస్తున్నారు. ఎప్పుడు ఏ పార్టీ తెలుగుదేశం కౌగిలిలోకి వెళ్ళిందో అప్పటికి ఆ పార్టీ పూర్వ స్థితి, ఆ తరువాత దుస్థితులను సంఖ్యలతో సహా లెక్కించి వివరిస్తున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బిజెపి ఉవ్వెత్తున ఎగిసింది. సొంతంగా పోటీ చేసి ఐదు పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18శాతం ఓట్లను, తెలంగాణలో 25 శాతం ఓట్లను బిజెపి సాధించుకుంది. కాంగ్రెస్, టిడిపిలకు ప్రత్యామ్నాయం అనే స్థాయికి బిజెపి ఎదుగుతున్న సమయంలో 1999లో చంద్రబాబు వ్యూహాత్మకంగా బిజెపితో చేతులు కలిపారు. ఆ ఎన్నికల్లో బిజెపికి 12 అసెంబ్లీ సీట్లు దక్కినప్పటికీ అప్పటి నుంచి ఆ పార్టీ పతనం మొదలైంది. 2004 ఎన్నికల్లో బిజెపి కేవలం రెండు సీట్లే గెలుచుకుంది. ఇప్పుడు కూడా అదే సంఖ్యతో సరిపెట్టుకుంది. టిడిపికి వ్యతిరేకంగా జనం బిజెపి వైపు ఆకర్షితులు కాగా స్వయంగా బిజెపీనే టిడిపి వైపు వెళ్ళడంతో ఆ పార్టీపట్ల జనంలో ఆసక్తి తగ్గింది. సొంతంగా పోటీ చేసి రాష్ట్రంలో 18 శాతం ఓట్లు సాధించిన పార్టీ కాస్తా చివరకు టిడిపితో పొత్తు దెబ్బతో కుదేలైపోయింది. ఇప్పుడు కేవలం 3.18 శాతం ఓట్ల సంతృప్తి చెందింది. తెలంగాణలో 25 శాతం ఓట్లు సాధించిన బిజెపి వందరోజుల్లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చినా జనం నమ్మలేదు.
Pages: 1 -2- News Posted: 30 May, 2009
|