వికటిస్తున్న వైఎస్ ఫార్ములా
హైదరాబాద్ : తమ పార్టీల్లో అసంతృప్తి వాదులను రెచ్చగొట్టి, తమ నాయకులకు ఎరలు వేసి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు గగ్గోలు పెడుతున్నారు. అసలు వైఎస్ కొత్త వైఖరి వల్లే స్వపక్షం లో అంతర్గత సెగలు రేగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకోవాలన్న వైఎస్ నూతన రాజకీయ సూత్రం అటు విపక్షంలోనూ, ఇటు స్వపక్షంలోనూ అభద్రతా భావాన్ని రేపింది. వైఎస్ పిలుపు అందుకుని నాయకులు వలసలు పోతే తమ పార్టీల గతేంటని విపక్షాలు అల్లాడిపోతుంటే, ఇలా ఉన్నట్టుండి కొత్తగా వచ్చే వలస నేతలతో తమ స్థానానికి ఎక్కడ ఎసరు వస్తుందోనని కాంగ్రెస్ సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.
మొత్తానికి ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కొత్త నేతల చేరికలు అసంతృప్తికి దారితీస్తోంది. రాష్ట్రమంతా ఇది చాపకింద నీరుగా పాకుతోంది. దశాబ్దాల నుంచి పార్టీకి సేవలందిస్తున్న తమను కాదని, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకోవడం అంతర్గతంగా చిచ్చు రగిలిస్తోంది. ఈ వ్యవహారంలో చివరకు పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ను సైతం దూరంగానే ఉంచడం చర్చనీయాంశమయింది. ఇటీవల టిడిపి నేతల తలసాని శ్రీనియాసయాదవ్ కాంగ్రెస్ లో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో... అవన్నీ ముఖ్యమంత్రే చూసుకుంటారని డిఎస్ వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.
Pages: 1 -2- -3- News Posted: 1 July, 2009
|