నారా వారి నోట్ల సూత్రం!
-వరప్రసాద్ గాలిదేవర
డబ్బుకు లోకం దాసోహం... అంటే లోకంలో అన్నీ దాసోహమన్నమాట. పైసా మే పరమాత్మ అన్నారు... పైసల్ పారేస్తే పరమాత్ముడు కూడా పరిగెత్తుకొచ్చి ప్రత్యక్షమవుతాడు. మన తెలుగోళ్ళమే కాదు ఇంగ్లీషోళ్ళు కూడా ఇలాంటివే చెప్పుకున్నారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ ని వగైరాలన్నమాట. డబ్బుతో ఏం చెయ్యవచ్చూ? ఇదేమిటి పిచ్చి ప్రశ్నా?? మీకు తెలియకపోతే అర్జెంటుగా ఆంధ్రాకు వచ్చేసి హైదరాబాద్ లో చంద్రబాబునాయుడు గారిని అడిగితే బోల్డన్ని చెబుతారు. డబ్బుతో ఎన్ని పనులు చేయవచ్చో వివరంగా ఏకరవు పెట్టగలరు. అసలు ప్రపంచంలో ప్రతీ పనీ డబ్బుతోనే సాధ్యమని ఆయన మనసా, వాచా, కర్మణా నమ్ముతున్నారని, ఆయన చెప్పినవి వింటే మీరూ గ్యారెంటీగా నమ్మేస్తారు.
రెండోసారి కూడా తెలుగు ఓటర్లు చంద్రబాబుకు సారీ చెప్పేసినప్పటి నుంచీ ఆయన నోరు తెరిస్తే డబ్బు మాటే వస్తోంది. ఐదు కోట్లు... పది కోట్లు... కళ్ళు చెదిరిపోయే డబ్బులిస్తే పేదింటి ఆడపిల్లలు శీలాన్ని కూడా వదిలేస్తారని చెప్పగలిగిన ఏకైక రాజకీయనాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడే కావచ్చు. ఆడపిల్లల శీలాలను ఫణంగా పట్టి ప్రత్యర్ధి పార్టీ రాజకీయం చేస్తోందని, దానికోసం డబ్బును ఎరగా వేసిందని, కాబట్టి డబ్బుకు లోకం దాసోం అన్న సూక్తిని చంద్రబాబు ఇలా నిరూపిస్తారు. ఘనత వహించిన ఈ నాయకుడు ఆవిష్కరించిన ఆధునిక అర్ధశాస్త్ర సూత్రీకరణ ప్రకారం వందల లక్షలు, వేల కోట్లు ఉన్న ధనవంతులెవరైనా నోట్ల కట్టలను చూపించి పేద ఆడపిల్లలను ప్రలోభాలతో లొంగదీసుకోవచ్చు. వారి శీలాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చు. కుటుంబ గౌరవం, భద్రమైన భవిష్యత్తు, సమాజంలో పరువు, చదువుకున్న జ్ఞానం అన్నింటినీ ఆడపిల్లలు కళ్ళు చెదిరే డబ్బుల కోసం తాకట్టు పెట్టేస్తారని ఇక నుంచి ఎవరైనా అనుకోవచ్చు. దానిని నమ్మనూ వచ్చు. ఎందుకంటే డబ్బుకోసం ఆడపిల్లలు ప్రలోభపడి, ఒక ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా సాక్ష్యం చెబుతున్నారని అన్నది సాదాసీదా వ్యక్తి కాదు. తొమ్మిదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి, జాతీయ స్థాయిలో, ఇంకో అడుగు ముందుకేస్తే అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ మేధావిగా పేరుతెచ్చుకున్న వ్యక్తాయే... ఆయన సాక్షాత్తు చంద్రబాబాయే మరి. మన దేశంలో ఆడపిల్లల ఆత్మాభిమానం మీద, ఆడపిల్లల శీలం మీద ఆయనకు ఎంత గౌరవం!. డబ్బుకు పేదోళ్ళు అందునా పేదంటి ఆడవారు లొంగిపోతారని ఆయన ప్రగాఢ విశ్వాసం మరి.
Pages: 1 -2- News Posted: 7 July, 2009
|