ప్రజానాడిని పట్టిన వైఎస్ న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పదేళ్ళ తరువాత కాంగ్రెస్ 2004లో అధికారంలోకి రావడానికి కారణమైన వైఎస్ రాజశేఖరరెడ్డి, తిరిగి 2009లో కూడా అధికారంలోని వస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి భరోసా ఇచ్చారు. శాసనసభలో తరచూ తన స్నేహితుడు, రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబునాయుడుతో వాద ప్రతివాదాల్లో 'విశ్వసనీయత' గురించి ప్రస్తావించే వైఎస్ పార్టీ అధిష్టానం వద్ద తన విశ్వసనీయతను రుజువు చేసుకున్నారు. టికెట్ ల కేటాయింపులో గెలుపు గుర్రాలే ప్రాతిపధక కావాలంటూ తన మాటను నెగ్గించుకున్న వైఎస్ అధిష్టానానికి మాట ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆధ్వర్యంలో సాధించిన విజయం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడానికి ఆధారమైంది. తొలుద ఐదేళ్ళలో నక్సలైట్లను ముఖ్యమంత్రి అణచివేసిన విషయం కూడా జాతీయ స్థాయిలో ఆయన పేరు మారుమోగటానికి కారణమైంది. అయితే, తన మిత్రుడు చంద్రబాబు లాగా జాతీయ మీడియాకు ఆయన దగ్గరగా ఉండేవారు కాదు. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత సిమ్లాలో కాంగ్రెస్ సమావేశానికి వైస్ హాజరయ్యారు. ఆ సమయంలో 'ఆయన చెప్పినట్లుగా విజయం సాధిస్తారా? లేకా దీర్ఘ కాలిక సెలవు తీసుకుంటారా' అని తామంతా సందేహపడ్డామని కేంద్రమంత్రి అంబికాసోని పేర్కొన్నారు. వైఎస్ ఏం చెప్పినప్పటికీ... కేంద్ర నాయకులకు మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయని - ఆయనతో పదేళ్ళకు పైగా పరిచయం ఉన్న ఆమె వివరించారు.
Pages: 1 -2- -3- News Posted: 4 September, 2009
|