హెలికాప్టర్లకు లీడర్లే పైలట్లా? న్యూఢిల్లీ : హెలికాప్టర్లు రాజకీయ నేతల చోదిత విహంగాలుగా మారిపోయాయా? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. గతంలో అంబాసిడర్ కార్లను వాడినంత తేలిగ్గా రాజకీయ నాయకులు ఇప్పుడు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. వాటిని పైలట్లు నడుపుతున్నారనడం కంటే రాజకీయ నేతల ఆదేశాలే నడుపుతూ ఉంటాయని, హెలికాఫ్టర్లో ఎక్కిన పెద్ద రాజకీయ నాయకులు అలా నడుపు, ఇలా నడుపు అంటూ ఫైలట్లపై ఒత్తిడి తెస్తూ ఉంటారని అధికారులు చెబుతున్నారు.
హెలికాప్టర్లను రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారానికి, ప్రభుత్వ పర్యటనలకు తరచుగా వాడుతూ ఉండడం, వీరికి తోడు పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులూ కూడా హెలికాప్టర్లపై ఆధారపడడంతో వాటికి అమాంతం డిమాండ్ పెరిగింది. హెలికాప్టర్లు ఎగిరే సమయం గణనీయంగా పెరిగిపోవడం, ప్రతికూల వాతావరణంలో కూడా తీసుకు వెళ్ళమని రాజకీయ నాయకులు పైలట్లను కోరడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కనీసం అరవై శాతం ప్రమాదాలకు పైలట్లపై రాజకీయ నాయకుల ఒత్తిడే కారణమని, చాలా సందర్భాలలో రాత్రికి ఎలాగైనా ఇంటికి చేరిపోవాలన్న నాయకుల కోరికే ప్రాణాలు తీస్తోందని వారు విశ్లేషించారు.
Pages: 1 -2- -3- News Posted: 4 September, 2009
|