జగన్...ఓ సంచలనం నాలుగు రోజుల క్రితం ఎవరైనా గుర్తించారా?. యదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి... మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడి ప్రాముఖ్యాన్ని? జగన్ అనే మూడక్షరాలు పేరు ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ముప్పై ఏడేళ్ల ఈ యువకుడు ఆంధ్రదేశానికి రారాజయ్యే అవకాశం అంచుల్లో నిలబడి ఉన్నాడు... సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఈ పరిణామాన్ని ఎవ్వరైనా కనీసం ఊహించగలరా? భవిష్యవాణిని ఔపోసన పట్టిన వారైనా? తలలు పండిన ఉద్దండ రాజకీయ పండితులైనా?
ఇడుపులపాయలో వైఎస్ శాశ్వత విశ్రాంతి ఇంకా తీసుకోనే లేదు. యావత్ ఆంధ్ర శోక సంద్రంలో మునిగే ఉంది. అభిమానుల గుండెలు రోదించి రోదించి అలసిపోయి ఆగిపోతూనే ఉన్నాయి. కాని అప్పుడే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని మెజారటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కోరుతూ సంతకాల సేకరణ పూర్తి చేశారు. గడిచిన కొన్నేళ్ళలో జగన్ కాంగ్రెస్ లో తన ఆధిపత్యాన్ని నిశ్శబ్దంగా నిర్మించుకునైనా ఉండాలి లేదా వైఎస్ అనుచర, సహచరుల్లో అసహనం మొదలై ఉండాలి. లేకపోతే జగన్ తండ్రి వైఎస్ అంత్యక్రియలైనా పూర్తయ్యే వరకూ కూడా ఆగలేనితనం ఎందుకు. పదవికి వారసునిగా జగన్ ను నిలపాలన్న ఆత్రుత ఎందుకు పెల్లుబికింది.
ఇటీవల కాలంలో జగన్ విశ్వరూపానికి హైదరాబాద్ నగరం సాక్షిగా నిలచింది. గత రెండు నెలలుగా ఉన్నతస్థాయి వర్గాలను జగన్ ఆంగ్ల దినపత్రిక ప్రచురణను చేపట్టబోతున్నారన్న వార్త కుదిపేస్తోంది. `ది విట్నెస్' పేరుతో త్వరలోనే భారీ స్థాయిలో ఈ పత్రిక రాబోతున్నదని, అసలు ఆయన `ఇండియన్ పోస్ట్' పత్రికను తీసుకోడానికి ప్రయత్నించారని, కానీ గుజరాత్ సమాచార్ పత్రిక యజమాని శ్రేయన్స్ షా ఆ టైటిల్ ను అమ్మడానికి నిరాకరించడంతో జగన్ తెలుగు 'సాక్షి' పత్రిక పేరుతోనే ఆంగ్లపత్రికను తేవాలని నిర్ణయించారన్న వార్తలు మీడియా ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నాయి.
Pages: 1 -2- -3- News Posted: 5 September, 2009
|