సైంటిస్టుల బురద బాంబులు న్యూఢిల్లీ : భారతదేశపు హైడ్రోజన్ బాంబు సామర్థ్యంపై రక్షణ పరిశోధన సంస్థ మాజీ అధికారి ఒకరు ప్రారంభించిన చర్చ స్థాయి నానాటికి దిగజారుతున్నది. దీనిపై శాస్త్రవేత్తలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పరస్పరం బురద చల్లుకుంటున్నారనిపిస్తున్నది. సరైన శాస్త్రీయ ఆధారాలను వారిలో ఒక్కరూ చూపలేకపోతున్నారు.
1998 మే 11, 13 తేదీలలో రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో అణ్వస్త్ర పాటవ పరీక్షలలో పాలు పంచుకున్న కె. సంతానం మే 11 నాడు పరీక్షించిన థర్మోన్యూక్లియర్ సాధనం (హైడ్రోజన్ బాంబు) ఆశించిన మేరకు 45 కిలో టన్నుల ఫలితాన్ని ఇన్వలేకపోయిందని తెలియజేశారు.
ఆ పరీక్షలు నిర్వహించి కొన్ని వారాలలోనే అమెరికన్ పరిశోధకుల బృందం ఈ పరీక్షల ఫలితాలపై అనుమానాలను వ్యక్తం చేశారు. కాని ఈ పరీక్షలు పూర్తిగా విజయవంతమయ్యాయని, ఇండియా ఇంకా అణ్వస్త్ర పాటవ పరీక్షలు నిర్వహించవలసిన అవసరం లేదని భారత అణుశక్తి శాస్త్రవేత్తలు వాదిస్తూ ఒక జర్నల్ లో పరిశోధన పత్రం వెలువరించారు. దీనితో అణ్వస్త్ర పాటవ పరీక్షలపై ప్రభుత్వం ఏకపక్షంగా మారటోరియం ప్రకటించింది.
అయితే, అణు ఇంధన సంస్థలో ఒకప్పుడు పని చేసిన సంతానం ఈ విషయమై ఆందోళనలను వెలిబుచ్చారు. నాలుగు వారాల క్రితం వ్యూహాత్మక నిపుణుల సమావేశంలో ఆయన మొదటిసారిగా ఈ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తన వాదనకు సమర్థనగా ఆ ప్రయోగ స్థలానికి సంబంధించిన కొన్నినిర్దుష్ట అంశాలను ఉటంకించారు. పేలుడు అనంతరం టెస్ట్ షాఫ్ట్ చెక్కుచెదరలేదని, అక్కడ కందకం (క్రేటర్) ఏర్పడలేదని, ప్రధాన హైడ్రోజన్ బాంబు 'ఉద్దేశించిన శక్తితో విస్ఫోటం చెందలేదు' అని పరీక్ష ఉపకరణాల రీడింగ్ వల్ల విదితమవుతున్నదని సంతానం వివరించారు.
Pages: 1 -2- -3- News Posted: 22 September, 2009
|