'మా ఒబామాకే ఎందుకు?' న్యూయార్క్ : ఈ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇవ్వనున్నట్లు నార్వేలోని అవార్డు కమిటీ ప్రకటించడం అమెరికన్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు ఈ అవార్డును ఒబామాకు ఎందుకు ప్రకటించారో అర్థం కాక వారు తలలు పట్టుకుంటున్నారు.
'ఆయన ఎందుకు ఈ అవార్డు విజేత అయ్యారో నేను గ్రహించగలిగితే అద్భుతమే' అని 82 సంవత్సరాల రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ క్లెయిర్ స్ప్రాగ్ న్యూయార్క్ మన్ హట్టన్ లోని గ్రీన్ విచ్ గ్రామంలో తన పెంపుడు శునకంతో పాటు నడుస్తూ వ్యాఖ్యానించారు. 'ఆయనను వారు గౌరవించాలని అనుకుని ఉంటారు. కాని ఆ గౌరవం ఎందుకో నాకు అర్థం కావడం లేదు' అని ఆమె అన్నారు. బ్రూక్లిన్ వాసి 33 ఏళ్ళ ఇత్యా సిల్వెరియో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఆయన నల్లజాతి వాడు కనుక ఆయనకు ఇది లభించిందని నేను తొలుత భావించాను' అని ఆమె చెప్పారు. 'అంత గొప్ప పని ఆయన ఏమి చేశారు? ఆయన కనీసం తన ఆఫీసులో కూడా సిబ్బందిని పూర్తిగా నియమించుకోలేదు' అని ఆమె అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఒబామా రేకెత్తించిన ఆశలే ఈ అవార్డు ఆయన ప్రకటించడానికి కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ వ్యాఖ్యానించారు. కార్టర్ 2002లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న విషయం విదితమే. 'అంతర్జాతీయ సంబంధాలలో ఆయన దూరదృష్టికి, శాంతి, సామరస్యాల సాధన పట్ల ఆయనకు గల అంకితభావానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుకు ఇది ప్రతీక' అని కార్టర్ పేర్కొన్నారు.
రిటైరైన ప్రభుత్వోద్యోగి, వియత్నాం యుద్ధంలో పాల్గొన్న సైనికుడు 62 ఏళ్ళ రాబర్ట్ షూల్జ్ తో ఈ అవార్డు గురించి ప్రస్తావించినప్పుడు 'ఏమి చేశారని' అని ఆయన ప్రశ్నించారు. 'ఆ మనిషి ఎక్కడా ఏ వివాదాన్నీ పరిష్కరించలేదు. మరి ఆయన శాంతి బహుమతిని ఎలా గెలుచుకున్నారు. అయితే, మరొక దఫా ఆయనను మేము తిరిగి ఎన్నుకోకపోయినట్లయితే మేమంతా ఇడియట్లలా కనిపిస్తాం. ఎందుకంటే ప్రపంచం ఆయనను మాకు అంటగట్టింది కదా' అని డల్లాస్ శివారు ప్రాంత వాసి అయిన షూల్జ్ అన్నారు.
Pages: 1 -2- -3- News Posted: 10 October, 2009
|