జనారణ్యంలోకి మావోలు! న్యూఢిల్లీ : శత్రువులకు దుర్బేధ్యమైన తమ స్థావరాల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళే ఎత్తుగడను సాయుధ మావోయిస్టులు అనుసరించనున్నారు. మావోయిస్టుల ఉద్యమాన్ని దేశం అంతరంగ భద్రతకు పెను సవాలుగా గుర్తించిన కేంద్రం మావోల ఏరివేతకు పెద్ద ఎత్తున సన్నాహకాలు చేస్తున్నవిషయం తెలిసిందే. మావోలకు పట్టున్న అబూజ్ మఢ్ అడవుల్లో వేటకు ఆపరేషన్ 'గ్రీన్ హంట్' పేరిట కేంద్రం సిద్ధమైంది. మూడు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు కూడా ఈనెల 13న ముగియడంతో 'గాలింపు' చర్యలపైనే కేంద్రం దృష్టి కేంద్రీకరించేందుకు వీలవుతుంది.
ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా కేంద్రం ఎత్తుకు పై ఎత్తుగా అటవీ ప్రాంతాల నుంచి జనారణ్యంలోకి రావడం ద్వారా కేంద్రం దాడుల్ని నిర్వీర్యం చేయాలని భావిస్తున్నారు. ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వస్తున్న నిఘా వర్గాల సమాచారం ఈ విషయాన్నే ధృవీకరిస్తోంది. 'మావోయిస్టులు అప్రమత్తం అయ్యారు. ప్రభుత్వం బలగాల తరలింపు ప్రక్రియలో ఉండగానే... వారు తమ స్థావరాలను ఖాళీ చేస్తారు. వారు గెరిల్లా యుద్ధ తంత్రం అమలు చేయగలిగే ప్రాంతాల నుంచి కూడా సాయుధబలగాల్ని తరలిస్తారు' అని నిఘా అధికారి ఒకరు చెప్పారు. ఈ వ్యూహం భద్రతాదళాలను కలవరపరుస్తోంది. 'ఈ దాడిలో ప్రతిఘటన ఉండదు. ఒకవేళ కనిపించినా... అది స్వల్పమే! దానర్ధం మేం సాధించేది ఏమీలేదు. పైగా... మాతో ఎప్పుడైనా.... ఎక్కడైనా పోరాడే అవకాశం మాత్రం మావోలకు ఉంటుంది' అని భద్రతాబలగాల వ్యూహకర్త ఒకరు పేర్కొన్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళడం ద్వారా విశేషంగా అకస్మిక దాడులకు పాల్పడటం ద్వారా కూడా నక్సల్స్ భద్రతా బలగాలకు నష్టాన్ని కలిగించే అంశాన్ని ఆయన తోసిపుచ్చలేదు.
Pages: 1 -2- -3- News Posted: 19 October, 2009
|