ఆగని యువతుల స్మగ్లింగ్ గోరఖ్ పూర్ : ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు తూర్పుగా 266 కిలో మీటర్ల దూరంలోని గోరఖ్ పూర్ స్టేషన్ లో 'పిల్లి, ఎలుక' ఆట సర్వసాధారణం అయిపోయింది. ఈ ఆటలో ఒక వైపు నేపాల్ నుంచి యువతులను అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులు ఉంటుండగా, మరొక వైపు ఆ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల బృందం ఉంటున్నది. రెండు దేశాల రాజకీయ నాయకుల మధ్య చర్చలలో ఈ అంశం ప్రస్తావనకు రాకపోతున్నప్పటికీ నేపాల్ లో భారత వ్యతిరేకత పెరిగిపోయేందుకు ఇది కారణమవుతున్నది.
నేపాల్ లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన మావోయిస్టులు మద్యం విక్రయాన్ని, యువతుల అక్రమ రవాణాని నిషేధించాలని కోరుతున్నారు. ఈ కార్యకలాపాలలో పాల్గొనేవారినెవరినైనా బహిరంగంగా అవమానించగలమని వారు విస్పష్టంగా ప్రకటించారు కూడా. భారత ప్రభుత్వం ఈ విషయమై పటిష్ఠమైన చర్య తీసుకోవాలని వారు కోరుతున్నారు.
'ఇంతకుముందు మేము గోరఖ్ పూర్ స్టేషన్ లో యువతులను రక్షిస్తుండేవారం. అటువంటి గుర్తించడం తేలిక. వారు భీతాహులై, ముడుచుకుపోయి ఉంటుంటారు. కాని తరువాత కొందరు దళారులు (మా నుంచి తప్పించుకోవడానికి) రైళ్ళు ఎక్కేందుకై గోరఖ్ పూర్ కు తూర్పుగా దాదాపు 100 కిలో మీటర్ల దూరంలోని దేవరియాకు రోడ్డు మార్గంపై వెళ్ళనారంభించారు' అని కేంద్ర ప్రభుత్వ సంస్థ 'చైల్డ్ లైన్ ఫౌండేషన్'కు చెందిన అభిషేక్ షాహి తెలియజేశారు. 'ఉపాధి చూపుతామనే వాగ్దానంతో నేపాల్ నుంచి యువతులను తీసుకువస్తున్నారు. వారిని సరిహద్దులో ఈవలివైపు కార్యకలాపాలు సాగించే దళారులకు అప్పగిస్తున్నారు. దళారులు ఆ తరువాత వారిని ఢిల్లీకి గాని, ముంబైకి గాని తీసుకువెళతారు. ఇతర దేశాలకు వెళ్ళేందుకై పాస్ పార్ట్ లభించేట్లు కూడా దళారులు చూస్తున్నారు' అని షాహి వివరించారు.
ముంబైలో కాబోయే కొనుగోలుదారుల ముందు ఆ యువతులను నిలబెడతారు. పిన్న వయస్కులను పశ్చిమాసియాలోని కొనుగోలుదారులకు విక్రయించి, మిగిలినవారిని దేశవ్యాప్తంగా వ్యభిచార గృహాలకు పంపుతుంటారు.
ఈ అక్రమ వ్యాపారులు, వారి ఏజెంట్లు ఉపాధి కల్పిస్తామని, స్పాలు, బ్యూటీ పార్లర్లు సందర్శించి రావచ్చని యువతులకు, వారి తల్లిదండ్రులకు నమ్మబలికి ఆతరువాత వ్యభిచార వృత్తిలోకి వారిని నెడుతున్నారు. అయితే, ఈ ఒప్పందాల వల్ల తల్లిదండ్రులకు గాని, యువతులకు గాని వచ్చే డబ్బు తక్కువే. ఏజెంట్ లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు ఆర్జిస్తుంటే తల్లిదండ్రులకు రూ. 5000 ఆప్రాంతాలలో మాత్రమే డబ్బు ముట్టుతూ ఉంటుందని షాహి చెప్పారు.
Pages: 1 -2- -3- News Posted: 29 October, 2009
|