అందానికి 'అరటి' చీర చెన్నై : అరటిని ఆరగించడంతో పాటు ఇక నుంచి చీరగా కట్టుకోవచ్చు. తమిళనాడులో ఒక నేత కార్మికుడు అరటి ఊచ నుంచి తీసిన నూలుతోను, ఇతర సహజ ఉత్పత్తులు కొన్నిటితోను చీరలు తయారు చేశాడు. అతనికి ఇందుకు స్ఫూర్తిదాతలు బెంగాల్ లోని నేత కార్మికులు. సి. శేఖర్ సృజనాత్మకత ధర్మమా అని ఏదో ఒక కొత్త పని చేయాలని ఆలోచించే మహిళలు అలో వెరా, జనపనార, గోగునార, మరి 12 సహజ పీచు పదార్థాలతో రూపొందించిన చీరను ధరించవచ్చు.
చెన్నైకి దాదాపు 45 కిలో మీటర్ల దూరంలోని అనకపుత్తూరు పట్టణ వాసి అయిన 45 సంవత్సరాల శేఖర్ బెంగాల్ లో చీరల తయారీకి జనపనారను ఉపయోగిస్తున్నారనే వార్తను చదివి, ఒక ఫ్రెంచ్ ఎగుమతిదారు కోసం వస్త్రాల సృష్టికి పత్తి నూలుకు బదులుగా జనపనారను ఉపయోగించడం ప్రారంభించాడు. ఇది జరిగింది దాదాపు పది సంవత్సరాల క్రితం.
'అరటి మొక్కల కాండం నుంచి తీసిన పీచుతో తయారు చేసిన వస్త్రాన్ని ఫిలిప్పీన్స్ లో నేత కార్మికులు వినియోగిస్తున్నారనే వార్తను అప్పట్లో నేను చదివాను. నేను ప్రయోగం చేయనారంభించాను. గుజ్జును ఎండబెట్టి సన్నని పోగులుగా మార్చి పీచును తీయడంలో త్వరగానే ప్రావీణ్యం గడించాను. మొదట్లో నేను చిన్న చిన్న వస్త్రాలు మాత్రమే నేసేవాడిని. అందువల్ల అంచు కోసం అరటి నారను ఉపయోగించేవాడిని. కాని ఇప్పుడు అరటి పీచుతో పూర్తి నిడివి చీరలను నేసేందుకు నా వద్ద ఇప్పుడు దాదాడు డజను మగ్గాలు ఉన్నాయి' అని శేఖర్ తెలియజేశాడు.
Pages: 1 -2- -3- News Posted: 4 November, 2009
|