మరుగుదొడ్లో మహానేతలు న్యూఢిల్లీ : మరుగుదొడ్లు (టాయిలెట్లు) నేతల పనితనానికి గీటురాయి అయినట్లయితే సోనియా గాంధి కన్నా డాక్టర్ మన్మోహన్ సింగ్ 18 ఏళ్లు వెనుకబడినట్లే పరిగణించాలి. ఇక గులామ్ నబీ అజాద్ విషయంలో బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన అలవాటుకు స్వస్తి చెప్పవలసిందిగా తన ఓటర్లను అడగవలసిన చివరి వ్యక్తి అవుతారు.
ఏమిటీ సోది అనుకుంటున్నారా? లేదు. మరుగుదొడ్ల పరంగా భారత దేశంలో నగ్న సత్యం ఇది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ అజాద్ నియోజకవర్గమైన జమ్ము సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని కనీసం 2266 సంవత్సరం వరకైనా చూడకపోవచ్చు. అంటే ఈ నియోజకవర్గం నిర్దేశించిన గడువుకు 254 సంవత్సరాలు వెనుకబడిందన్నమాట. శుక్రవారం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం జరగబోతుండగా మన క్యాబినెట్ మంత్రులు అక్షరాలా దుర్గంధాన్ని వ్యాపింపచేస్తున్నారు. 33 మంది మంత్రులలో తొమ్మిది మంది మాత్రమే 2012 కల్లా పూర్తి పారిశుద్ధ్యం లక్ష్యాన్ని చేరుకోనున్నారని అంతర్జాతీయ ఎన్ జిఒ 'వాటర్ ఎయిడ్' జరిపిన విశ్లేషణలో వెల్లడైంది. ఈ సంస్థ నివేదిక శుక్రవారం విడుదల కానున్నది.
చివరకు పారిశుద్ధ్య పథకాలు సక్రమంగా సాగేట్లు చూడవలసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సి.పి. జోషి నియోజకవర్గం కూడా పూర్తి పారిశుద్ధ్యానికి ఇంకా 14 ఏళ్లు నిరీక్షించవలసి ఉంటుంది. అంటే గడువు కన్నా 11 ఏళ్లు ఆలస్యం అవుతుందన్నమాట. ఐక్యరాజ్య సమితి (యుఎన్) సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు (ఎండిజి)లో భాగమే ఈ గడువు. 'ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ల మంది ప్రజలు బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేస్తున్నారు. వారిలో మూడింట రెండు వంతుల మంది 778 మిలియన్ల మంది దక్షిణాసియాలో ఉన్నారు. మళ్లీ వారిలో కూడా 665 మిలియన్ల మంది ఇండియాలోనే ఉన్నారు. ప్రపంచం దుర్గంధం నుంచి విముక్తి పొందాలా వద్దా అనేది ఇండియా నిర్ణయించవలసి ఉంది' అని ఈ నివేదిక పేర్కొన్నది. తమ తమ రాష్ట్రాలలో, నియోజక వర్గాల పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యాల మేరకు జరుగుతుందా లేదా అని బాధ్యతగా పర్యవేక్షించాల్సిన మన నేతల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ నివేదిక.
అయితే, దేశంలో పరిస్థితి అంతా అధ్వాన్నంగా లేదు. రక్షణ శాఖ మంత్రి ఎ.కె. ఆంటోనీకి, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖ మంత్రి వాయలార్ రవికి శాశ్వత చిరునామా అయిన తిరువనంతపురం గడువు కన్నా మూడు సంవత్సరాలు ముందుగానే ఈ సంవత్సరమే లక్ష్యాన్ని సాధించబోతున్నది.
Pages: 1 -2- -3- News Posted: 19 November, 2009
|