నేతలపై 'బార్బోరా' దాడి న్యూఢిల్లీ : సైనిక దుస్తులు ధరించిన వారెవరూ అడుగుపెట్టేందుకు సాహసించని ప్రాంతం (రంగం)లోకి ఎయిర్ మార్షల్ పి.కె. బార్బొరా మరొకసారి ప్రవేశించారు. రాజకీయ నాయకులపై ధ్వజం ఎత్తారు. రాజకీయ నాయకులు తమ సంకుచిత ప్రయోజనాల కారణంగా సైనిక దళాల ఆధునికీకరణను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దేశ భద్రత కన్నా రాజకీయాలే తరచు ఎలా అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయో సైనిక దళాలు చాలాకాలంగా గుసగుసలాడుతున్నాయి. కాని ఇంకా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూనే ఇంత బాహాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు.
కాని బార్బొరా తీరే వేరు. యువకుడుగా ఉన్న రోజుల్లోనే మిగ్-21 విమానాలలో యుద్ధ విన్యాసాలు సాగించడం గాని, క్రితం సంవత్సరం నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాదుల దాడుల అనంతరం తన దళానికి పాకిస్తాన్ లో '5000 లక్ష్యాలను' దెబ్బ తీయగల సామర్థ్యం ఉందని పశ్చిమ వైమానిక దళం అధిపతిగా ఉంటూనే ప్రకటించడం గాని బార్బొరాకే చెల్లింది.
దీనికి తోడు రాజకీయంగా సరి కానప్పటికీ లేదా అప్రియమైనవి అయినప్పటికీ తన మనసులో మాటను బయటకు కక్కడం ఆయన తత్వం. మహిళలను ఫైటర్ పైలట్లుగా ఇంకా ఎందుకు చేర్చుకోజాలరో తన 'వ్యక్తిగత' అభిప్రాయాలను వ్యక్తం చేసి, కొందరి మనోభావాలను దెబ్బ తీసినందుకు ఒక వైపు విచారం వెలిబుచ్చుతూనే భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్) వైస్ చీఫ్ గురువారం మరొకసారి తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వ్యక్తం చేశారు.
Pages: 1 -2- -3- News Posted: 20 November, 2009
|