దటీజ్ కేటీఆర్! హైదరాబాద్ : ఆయన ఏమాత్రం కష్టపడకుండానే తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన ఏమాత్రం 'హడావిడి మనిషి' కారని, కాని అటువంటి పరిస్థితే తలెత్తితే అందుకు సిద్ధంగా ఉన్నారని మరికొందరు అంటున్నారు. అత్యంత వేగంగా మారిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో అంతగా ఆకాంక్షలు లేనట్లుగా కనిపిస్తున్న కుమారుడే వృద్ధిలోకి వస్తున్నారు.
తెలంగాణ కోసం పోరు ప్రారంభమైనప్పుడు కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) అందరి దృష్టినీ ఆకర్షించారు. అదే సమయంలో ఆయన తండ్రి కె. చంద్రశేఖరరావు (కెసిఆర్) ఆసుపత్రి బెడ్ పైనే నిరాహార దీక్ష సాగిస్తున్నారు. ఎక్కువగా జీన్, టీ షర్టు ధరించి కనిపించే, అమెరికా నుంచి ఎంబిఎ తీసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్, తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తంచేసే తారక రామారావు చివరకు తెలంగాణ రాజకీయ రంగంలో ఢక్కామొక్కీలు తిన్న తన తండ్రిని కూడా అప్రతిభుడిని చేశారు.
కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి తీవ్ర జాప్యం చేస్తుండగా నిరాహార దీక్ష విరమించవలసిందిగా కెసిఆర్ కు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పెద్దలు, కుటుంబ సభ్యులలో మిగిలినవారు సలహా ఇవ్వగా, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరులో తన తండ్రి 'అమర వీరుడైనా' తనకు ఫర్వాలేదని రామారావు చెప్పారు. 'తెలంగాణ సాధించలేకపోయిన ఇరకాట స్థితిని ఎదుర్కోవడం కన్నా మరణాన్నే మా నాన్నగారు కోరుకుంటారు' అని ఆయన చెప్పారు. 'నానాటికీ కృశించిపోతున్న' టిఆర్ఎస్ బాస్ నిరశన దీక్షను విరమించేట్లుగా ఒప్పించాలనే నిర్ణయానికి వచ్చారని అందరూ భావిస్తుండగా రామారావు అటువంటి వ్యాఖ్య చేస్తారని ఊహించినవారు కొద్దిమందే. అయితే, రామారావు ఆలోచనలు వేరే. 'తనకు తాను ఇబ్బందికర పరిస్థితులు తెచ్చుకునే కన్నా ఒక ప్రయోజనం కోసం మా తండ్రి అమరవీరుడైనా నాకు ఫర్వాలేదు' అని ఆయన అన్నారు.
పది మంది ఎంఎల్ఎలు మాత్రమే ఉన్న టిఆర్ఎస్ రాష్ట్ర శాసనసభలో బలమైన పార్టీ కాకపోవచ్చు. కాని కీలకమైన వర్గం - జీన్స్ ధరించే యువతరం మద్దతు లభించేలా 35 సంవత్సరాల రామారావు చూడగలిగారు. అయితే, రామారావు హుందాగానే వ్యవహరిస్తున్నారు. 'మా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని నేను హడావుడి పడడం లేదు. కాని తప్పనిసరి పరిస్థితి వస్తే నేను అందుకు సిద్ధం' అని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 11 December, 2009
|