ఇన్వెంటర్లకు '3 ఇడియట్స్' నిధి ముంబై : నూతన ఆర్థికాభ్యున్నతి దశాబ్దిలోకి అడుగుపెట్టడానికి ఇండియా సన్నద్ధం అవుతుండగా, ఈ సంవత్సరపు 'టాప్' చిత్రం '3 ఇడియట్స్' దేశంలో అట్టడుగు స్థాయిలో శీఘ్రంగా విస్తరిస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపార రంగాలకు కొత్త జవజీవాలు ఇస్తున్నది. నిరుపేద అయిన, తెలివిమంతుడైన శోధకుడు (ఇన్వెంటర్) సాధించిన విజయాలను సూచించే '3 ఇడియట్స్' చిత్రాన్ని మీరు చూసి ఉంటే, స్కూటర్ శక్తితో పని చేసే పిండి మర, సైకిల్ శక్తితో పని చేసే హార్స్ హెయిర్ క్లిప్పర్ (కేశ ఖండిని), ఎక్సర్ సైకిల్-కమ్-వాషింగ్ మెషీన్ గురించి తెలుసుకునే ఉంటారు.
బాక్సాఫీసు వసూళ్ళలో '3 ఇడియట్స్'దే అగ్రస్థానం. దీనితో నిర్మాత విధు వినోద్ చోప్రా వాస్తవ జీవితంలో ముగ్గురు మేధావులకు( కేరళ టీనేజర్ , మహారాష్ట్ర పెయింటర్ , ఒక యుపి క్షురకుడు) సాయం చేసేందుకు ఒక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇంజనీర్ కావాలని ఆకాంక్షించిన 'రాంచో' లేదా రాంచోడ్ దాస్ శ్యామల్ దాస్ చంచడ్ ఈ చిత్రంలో హీరో. ఈ పాత్ర ఎన్నెన్నో కలలు కంటూ వాటిని సాఫల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆమీర్ ఖాన్ ఈ పాత్రను పోషించారు.
కింది స్థాయి శోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలని హనీ బీ నెట్ వర్క్ అనే సంస్థ 16 సంవత్సరాల క్రితం చేసిన ప్రతిపాదన స్ఫూర్తితో ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ఈ కొత్త సాధనాల (ఇన్వెన్షన్ల) గురించి తెలియజేసింది.
గ్రామీణ శోధనలపై జనం దృష్టిని మళ్ళించడానికి ఇదే సరైన సమయం. సృజనాత్మకతకు విలువ ఇవ్వడం అంతకంతకు ఎక్కువవుతున్నది. అయితే, పాఠశాలలు, కళాశాలలలో బట్టీయానికి ఇప్పటికీ ప్రాముఖ్యం ఇస్తున్న తరుణంలో దీని ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.చోప్రా విరాళాన్ని 'ఇడియట్-ఎన్ఐఎఫ్ నిధి'గా మనం పేర్కొనవచ్చు అని హనీ బీ సంస్థ వ్యవస్థాపకుడు, అహ్మదాబాద్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) ప్రొఫెసర్ అనిల్ గుప్తా చమత్కరించారు.
Pages: 1 -2- -3- News Posted: 31 December, 2009
|