'పద్మ'కు పట్టని మూన్ టీం న్యూఢిల్లీ : భారతదేశం చంద్రునిపై నీటిని కనుగొన్నది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది. గత సంవత్సరం ఎంతగానో చెప్పుకోదగిన వైజ్ఞానిక ఘనత అది. రూ. 386 కోట్ల 'చంద్రయాన్ 1' యాత్రలోనే చంద్ర మండలంలో నీటి కణాలను కనుగొన్నారు. అటువంటి ప్రతిష్ఠాకరమైన ఈ యాత్రతో సంబంధం ఉన్న సైంటిస్టులు, ఇంజనీర్లు గుర్తింపునకు నోచుకోలేకపోయారు. పద్మ అవార్డుల జాబితాలో వారి పేర్లేవీ చోటు చేసుకోలేదు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అణు ఇంధన శాఖ (డిఎఇ) వంటి ప్రభుత్వ సంస్థలకు సంబంధించివారు ప్రతిష్ఠాకరమైన పద్మ అవార్డులు వంటి 'ప్రభుత్వ ప్రాయోజిత' అవార్డులకు అర్హులు కారని స్పష్టం చేస్తూ కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం రూపొందించిన నిబంధనే వారి కృషిని పట్టించుకోకపోవడానికి కారణం.
ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు, వివక్షతో కూడిన ఈ నిబంధనను మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభమైనట్లు అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. ప్రైవేట్ రంగ సంస్థలలో కన్నా బాగా తక్కువ వేతనాలకు, జాతికే గర్వకారణం కావచ్చుననే స్ఫూర్తితో అధికార (ప్రభుత్వ) సంస్థలలో కష్టపడి పని చేసేవారి నైతిక స్థైర్యాన్ని ఇది దెబ్బ తీయగలదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఈ నిబంధనను మార్చాలని ఇప్పుడు కోరుకుంటున్నది.
Pages: 1 -2- -3- News Posted: 29 January, 2010
|