వైష్ణవి బలైంది ఎందుకు? హైదరాబాద్ : డబ్బుకు కొదువ లేదు. పెళ్లి చేసుకుంటాం. ఇంత వరకు బాగానే ఉంది. రెండు పెళ్లిళ్ల వ్యవహారమే చివరకు వైష్ణవి అనే అమాయక బాలిక హత్యకు దారి తీసింది. మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సామాజిక వర్గాలతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో సాగుతున్న బహుభార్యత్వం దురాచారానికి డబ్బు మేలి ముసుగులు వేస్తోంది. వైష్ణవి తండ్రి, మద్యం వ్యాపారవేత్త ప్రభాకరరావుకు భార్యలు ఇద్దరు. అందరికీ తెలిసిన సత్యం ఇది. దురాచారమే అయినా సమాజంలో ఆయన పలుకుబడికి ఢోకా లేకుండా పోయింది. ఆయన ఇద్దరు భార్యలతో జీవితం సాగిస్తున్నారు. చివరకు ఆయన సంపద గురించి సవతులు, వారి బంధువులు మధ్య కలహాలు ఈ విషాదానికి దారితీసింది.
బహుభార్యాత్వం 1955 నాటి హిందూ వివాహ చట్టం కింద అక్రమమైనప్పటికీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారు ఎందరో ఉన్నారు. సంప్రదాయానుసారం కాకుండా వ్యక్తి ఆర్థిక, సామాజిక పలుకుబడి ఆధారంగానే ఈ ధోరణి ప్రబలుతోంది. రాష్ట్రంలో పితృస్వామ్య వ్యవస్థ ఈ బహుళ పెళ్లిళ్ల పద్ధతి కొనసాగడానికి దోహదం చేస్తున్నదని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు.
'మన సమాజంలో ఇంకా బహుభార్యాత్వానికి ఆమోదం లభిస్తున్నది. సమాజంలో దీనిని ఎవరూ నిరసించడం లేదు. పెద్దపెద్దవాళ్ళు అంటే రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, సినీ తారలు అంతా ఇద్దరు భార్యలతో తిరుగుతున్నారు' అని ప్రగతిశీల మహిళా సంఘం (పిఒడబ్ల్యు) నాయకురాలు వి. సంధ్య పేర్కొన్నారు. 'చిన్నిల్లు' ఉంటే గొప్ప అనే ధోరణి ప్రబలిపోయింది. అంటే రెండవ భార్య తన భర్తతో కలిసి ఉండడం అనేది చట్టం ఉల్లంఘనను గొప్పతనంగా చేస్తున్నది. 'బహుళ జీవిత భాగస్వాములతో పాటు ధన బలం కలిగి ఉండడం ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న భూస్వామ్య సంస్కృతిని ప్రతిబింబిస్తున్నది' అని మహిళా చేతన అనే సంస్థ నాయకురాలు కె. పద్మ వ్యాఖ్యానించారు. 'తెలుగు నాడు'లో బహుభార్యాత్వం బహిరంగ రహస్యమేనని, దీనికి ఎవ్వరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదని ఆమె పేర్కొన్నారు.
Pages: 1 -2- -3- News Posted: 3 February, 2010
|