రిక్షాతో అమెరికాకు!

పాట్నా : బీహార్ నుంచి రిక్షాతో అమెరికాకు! ఇర్ఫాన్ ఆలమ్ కే ఈ ఘనత దక్కింది. రిక్షా డ్రైవర్ల శ్రేయస్సు కోసం తాను చేసిన శోధనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఆలమ్ ఆహ్వానాన్ని అందుకున్నారు. తన వ్యాపార దక్షతతో బహుదా ప్రశంసలు పొందిన బీహారీ లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరే కాదని ఆలమ్ నిరూపించారు. ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ అయిన 35 సంవత్సరాల ఇర్ఫాన్ ఆలమ్ రిక్షాలకు ఆధునిక రూపు తీసుకువచ్చి పుల్లర్ల ఆదాయాన్ని, గౌరవాన్ని పెంచారు. ఏప్రిల్ 26, 27 తేదీలలో వాషింగ్టన్ లో నిర్వహించనున్న 'ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తల శిఖరాగ్ర సదస్సు'కు ఒబామా ప్రపంచమంతటి నుంచి ఆహ్వానించిన 79 మంది 'విశిష్ట' పారిశ్రామిక, వ్యాపారవేత్తలలో ఆలమ్ ఒకరు.
ఇర్ఫాన్ ఆలమ్ డిజైన్ చేసిన ఆధునిక రిక్షాలో మినరల్ వాటర్, సాఫ్ట్ డ్రింకులు, వార్తాపత్రికలు, 'అత్యవసరమైన ఇతర చిల్లర మల్లర వస్తువులు' నిల్వ చేయడానికి వీలుగా అరలు ఉన్నాయి. రిక్షా పుల్లర్లు వీటిని తమ కస్టమర్లకు అమ్మి అదనపు ఆదాయం పొందవచ్చు. ఇంకా ఇర్ఫాన్ ఈ రిక్షాలపై తమ ప్రకటనల ప్రదర్శనకై వివిధ కంపెనీలను ఒప్పించారు. ఈ ప్రకటనల నుంచి వచ్చే ఆదాయంలో సగం రిక్షా పుల్లర్ కు పోగా మిగిలినది సమ్మాన్ ఫౌండేషన్ కు సమకూరుతుంది. ఈ సంస్థను ఇర్ఫాన్ 2007లో పాట్నాలో ఏర్పాటు చేశారు. 'ఈ 50 శాతం ప్రకటనల ఆదాయం ఫౌండేషన్ మనుగడకు, వ్యాపారం పెంపుదలకు దోహదం చేస్తుంది' అని ఇర్ఫాన్ తెలియజేశారు. ఈ సంస్థ ఢిల్లీ, హర్యానా, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్ లలో కూడా రిక్షా పుల్లర్లకు సాయం చేస్తుంటుంది.
Pages: 1 -2- -3- News Posted: 6 February, 2010
|