రాహుల్ ఫోబియా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో కీలక అధికార కేంద్రంగా రాహుల్ గాంధి ఆవిర్భావం సీనియర్ నాయకుల మధ్య పెనగులాటకు దారి తీస్తున్నది. చివరకు సోనియా గాంధి యంత్రాంగంలో పాతుకుపోయిన నాయకులు కూడా తమ విధేయతలను విస్తరించుకోవడానికి పోటీ పడుతున్నారు. సోనియా, రాహుల్ పట్ల విధేయతలు పరస్పర విరుద్ధమైనవి కాకపోయినప్పటికీ సీనియర్ నాయకులు అనేక మంది తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
రాహుల్ గాంధిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పుడు సోనియా బృందంలోని శక్తిమంతులైన సభ్యులు ఆయనతో కలసి పని చేసేందుకు తమకు అవకాశం లభిస్తుందని, క్రమంగా ఆయన యంత్రాంగంలో అంతర్భాగం కాగలమని భావించారు. అయితే, తన కోసం ప్రత్యేకంగా ఒక సెక్రటేరియట్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా రాహుల్ ఒంటరిగా పనులు నిర్వర్తిస్తారని వారు ఊహించలేదు. యువ ఎంపి తనకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. విధుల పరంగా నంబర్ 24 అక్బర్ రోడ్ లోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) యంత్రాంగంతో ఎటువంటి సంబంధం లేకుండా ఆ వ్యవస్థ దాదాపు స్వతంత్రంగా పని చేస్తున్నది. రాహుల్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం అరుదు. ఆయనకు అనుబంధితమైన ఎఐసిసి కార్యదర్శులు కూడా తమ కార్యాలయాలు ఎఐసిసి భవనంలోనే ఉన్నప్పటికీ స్వతంత్రంగా పని చేస్తుంటారు.
Pages: 1 -2- -3- News Posted: 22 February, 2010
|