స్వరాలతో కాసుల వర్షం న్యూఢిల్లీ : 2000లో ఆ సంస్థ ఆదాయం రూ. 110 కోట్లు. 2009 మార్చికల్లా ఆ రాబడి రూ. 350 కోట్లకు పెరిగింది. మరీ ముఖ్యంగా లాభాలు 'పదింతలు' అయ్యాయి. ఆ సంస్థే ఈ విషయం వెల్లడించింది. ప్రస్తుతం సంగీతం నుంచి మరింత మెరుగైన పద్ధతుల ద్వారా సంస్థ తన రాబడిని పెంచుకున్నది. ప్రస్తుతం సంస్థ రెవెన్యూలలో 60 శాతం పైగా టివి, రేడియో, రెస్టారెంట్లు, ఇతర బహిరంగ ప్రదేశాలు, రింగ్ టోన్ల నుంచి లైసెన్సింగ్ ఫీజు లేదా రాయల్టీల ద్వారా వస్తున్నది. (ఆ సంస్థ తరఫున హంగామా రింగ్ టోన్లను విక్రయిస్తున్నది.) మిగిలిన 40 శాతం కేసెట్లు, సిడిల అమ్మకం ద్వారా లభిస్తున్నది.
(2007 గణాంకాల ప్రకారం) రూ. 2600 కోట్ల సంగీత పరిశ్రమలో వ్యాపారం తీరుతెన్నులనే ఇది మార్చివేస్తున్నది. చీలికలు పేలికలు అయిపోయిన సంగీత విపణిలో చాలా సంస్థలు రాయల్టీ వసూలు సంస్థల నుంచి పెద్ద వాటా పొందడానికి లేదా మరింత రాయల్టీ చెల్లించేట్లుగా టెలికమ్ సంస్థలను ఒప్పించడానికి ఇప్పటికీ నానా ప్రయాస పడుతుండగా, తన సంగీతంలో నుంచే అధిక ప్రతిఫలాన్ని పొందడంలో 'టి-సీరీస్' సాధించిన విజయం నిజంగా గణనీయమైనది. వృద్ధిపైన, రెవెన్యూ నష్టాలను అరికట్టడంపైన కంపెనీలు దృష్టి పెట్టసాగితే పైరసీ విషయమై మొత్తుకొనే బదులు తమ స్థితిగతులనే మార్చుకోవచ్చునని ఈ సంస్థ విజయం సూచిస్తున్నది.
టి-సీరీస్ ఇక ఇంటర్నెట్ ను ఢీకొనాలని యోచిస్తున్నది. తనకు కాపీరైట్ ఉన్న సంగీతాన్ని ఉపయోగిస్తుండడంపై టి-సీరీస్ గూగుల్ కు చెందిన యూట్యూబ్ పై ఒక దావా వేసింది.'గూగుల్, యాహూలను కిందకు దింపవలసి ఉంటుంది' అని టి-సీరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) భూషణ్ కుమార్ అన్నారు. రెవెన్యూను పంచుకోవలసిన విధానంపై ఆయన ప్రస్తుతం భారీ ఆన్ లైన్ సంస్థలు కొన్నిటితో సంప్రదింపులు సాగిస్తున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 24 February, 2010
|