పేరుతో ఎంత కష్టం! న్యూఢిల్లీ : 2001 సెప్టెంబర్ 11 తరువాత ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు జీవితం చాలా విధాలుగా మారిపోయింది. అద్దెకు ఇల్లు సంపాదించడం గగనమైపోయింది. గడ్డం, తలపై తెల్ల టోపీ ఉంటే బస్సుల్లో, రైళ్ళలో కనిపించేవి అనుమానపు దృక్కులే. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులు ముందుగా నిర్బంధంలోకి తీసుకునేది అమాయక ముస్లిం యువకులనే. ఇటువంటి అన్యాయపు పరిస్థితినే 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రంలో షారుఖ్ ఖాన్ పాత్ర 'నా పేరు ఖాన్, నేను టెర్రరిస్టును కాను' అనే వాక్యాలతో వివరిస్తుంటుంది.
ఖాన్ సంగతి అలా ఉంచండి. అది చలనచిత్రం మాత్రమే. కాని నిజ జీవితంలో ఎవరికైనా ఒసామా లేదా సద్దామ్ లేదా దావూద్ అనే పేరు ఉంటే, అదీ సదరు మనిషి మతపరంగా సున్నితమైన గుజరాత్ వాసి అయి ఉంటే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? జనానికి వెంటనే ఆ పేరు వెనుక టెర్రరిస్టు ఛాయ కనిపించదా? గతంలో వివిధ సమయాలలో ఈ పేర్లు పాపులర్ అయ్యాయి. ఉదాహరణకు, 1990లో మొదటి గల్ఫ్ యుద్ధం ముగిసిన వెంటనే జన్మించిన పిల్లలు అనేక మందికి సద్దామ్ అని నామకరణం చేశారు. పాశ్చాత్య దేశాల సైన్యాలను దీటుగా ఎదుర్కొన్నందుకు ముస్లిం ప్రపంచ ఇరాకీ మాజీ నియంత సద్దామ్ హుస్సేన్ ను హీరోగా కొలిచిన కాలం అది. ఈ పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్దవారయ్యారు. ఇది పేరే కదా ఏముంది అనుకోవడానికి వీలు లేని పరిస్థితి ఇప్పుడు.
తాము తమ బస్తీలకు లేదా ఇళ్లకు పరిమితమై ఉన్నంత సేపు తమకు ఇటువంటి పేర్లతో సమస్య తలెత్తదని ముస్లింలు చెబుతుంటారు. కాని బయటకు వస్తే చాలు ఒసామా లేదా సద్దామ్ వంటి పేరు ఒక్కసారిగా అనుమానాలకు తావిస్తుంటుంది. విమానాశ్రాయాలు వంటి ఉన్నత శ్రేణి భద్రతా ప్రాంతాలలో రకరకాల ప్రశ్నలతో వేధిస్తుంటారు. వీరికి జీవనం నల్లేరుపై నడక కాదు. సినిమా వలె సుఖాంతమయ్యేది కాదు.
Pages: 1 -2- -3- News Posted: 1 March, 2010
|