షారూక్ సర్జరీ 16న
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కు ఈనెల 16న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో సర్జరీ జరుగనుంది. గత ఏడాది నవంబర్ లో 'దుల్హన్ మిల్ గయే' సెట్స్ లో ఆయన గాయపడ్డారు. ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఇప్పటికే ఆయన శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉండగా బిజీ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. గతంలో కూడా షారూక్ మోకాలి ఆపరేషన్, స్పైనల్ ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే ఆ రెండు ఆపరేషన్లు విదేశాల్లో జరుగగా, ఇండియాలో ఆపరేషన్ చేయించుకోవడం ఇదే ప్రథమం.
ఆపరేషన్ అయిన వెంటనే షారూక్ డిశ్చార్జి అవుతారనీ, ఆయన భుజం మళ్లీ పూర్తి సామర్థ్యం పుంజుకోవాలంటే కనీసం రెండు నెలల పడుతుందనీ ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఏప్రిల్ లో ప్రారంభం కానున్న ఐపిఎల్ సెకెండ్ సీజన్ కారణంగా షారూక్ బిజీ అనీ, జూలై-ఆగస్టు నాటికి ఆయన పూర్తి ఫిట్ నెస్ సంతరించుకోవచ్చనీ వారు అభిప్రాయపడ్డారు. షారూక్ సొంతంగా నిర్మించిన 'బిల్లూ బార్బర్' చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News Posted: 9 February, 2009
|