స్లమ్ డాగ్ కు 'భాఫ్తా' పంట
ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగిస్తూ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను ఎగరేసుకుపోయిన 'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రం ఆస్కార్ అవార్డులు అందుకునేందుకు మరింత దగ్గరైంది. ఇటీవల క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు, 4 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం ఇప్పుడు 2009 సంవత్సరం బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (భేఫ్తా) అవార్డులను ఎగరేసుకుపోయింది. 11 కేటగిరిలలో ఈ చిత్రం నామినేట్ కాగా, 7 విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుని తన సత్తా చాటుకుంది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (డోనీ బోయిల్), బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే (సైమన్ బెఫాయ్), ఉత్తమ సంగీతం (ఎ ఆర్ రెహమాన్), బెస్ట్ ఎడిటింగ్ (క్రిస్ డికెన్స్), బెస్ట్ సౌండ్ (రెసుల్ పూకుట్టి, గ్లెన్ ఫ్రీమాంట్లే, రిచర్డ్్ ప్రికె, టామ్ సేయర్స్, ఇయాన్ టప్), బెస్ట్ సినిమాటోగ్రఫీ (అంథోని డాడ్ మాంట్లె) విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. ముంబై నేపథ్యంలో పలువురు భారతీయ కళాకారులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన 'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రాన్ని డేనీ బోయిల్ తెరకెక్కించారు. దేవ్ పాటిల్, ఫ్రిడా పింటో, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు.
News Posted: 9 February, 2009
|