గ్రామాల దత్తతలో స్టార్స్
స్టార్ ఇమేజ్ అనేది ప్రేక్షకాభిమానుల వల్లే నటీనటులకు సంక్రమిస్తుంటుంది. వెండితెరపై వారు పోషించే పాత్రల ప్రభావం జనంపై ఉంటుంది. కొందర్ని రోల్ మోడల్స్ గా తీసుకుంటూ ఉంటారు. అలాంటి హీరోలు మంచిపనులు చేస్తూ, సామాజిక చైతన్యానికి నడుం బిగిస్తే వారిని ఆరాధ్యదైవాలుగా జనం భావించడంలోనూ తప్పుండదు. బాలీవుడ్ నటి ప్రీతిజింటా చేపట్టిన సామాజిక కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా పలువురు సెలబ్రేటీలు పాలుపంచుకునేందుకు ఇప్పుడు ముందుకు వస్తూ అందిరి అభిమానం చూరగొంటున్నారు. ఇండియాలో విద్యుత్ సౌకర్యానికి నోచుకోని గ్రామాలకు చేయూత నిచ్చేందుకు ప్రీతిజింటా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియా వ్యాప్తంగా చీకట్లలో మగ్గుతున్న గ్రామాలు, కనీసం పదేళ్లుగా విద్యుత్ కు నోచుకోని గ్రామాలకు సోలార్ పవర్ ను అందజేయాలనే ఓ ప్రాజెక్ట్ లో భాగంగా నిధుల సేకరణకు ప్రీతిజంటా ప్రచారం చేస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రీతిజింటా, శిల్పా శెట్టి, అక్షయ్ కుమార్, షారూక్ ఖాన్ లు ఇప్పటికే పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. వీరు ఒక్కో గ్రామామానికి 3 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. 5 గ్రామాలను శిల్పా శెట్టి దత్తత తీసుకుంటే, అక్షయ్ కుమార్ తనయుడు కూడా ప్రీతిజింటాను కలుసుకుని తాను కూడా ఓ గ్రామాన్ని దత్తతు చేసుకోవాలనే ఆసక్తిని కనబరచారు. షారూక్ 5 గ్రామాలను దత్తత తీసుకుంటే, ప్రీతి, ఆమె తల్లి చెరో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ మంచి పనిలో మరింత మంది పాలుపంచుకునేందుకు ముందుకు వస్తున్నారు. చిమ్మచీకట్లు రాజ్యమేలా గ్రామాల్లో విద్యుత్ కాంతులీనే రోజులు వస్తే ఇంటింటా పండుగే మరి...
News Posted: 11 February, 2009
|