జీనత్ అమన్ కారు చోరీ
ముంబైః వెటరన్ నటి జీనత్ అమన్ కారును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఆమెకు చెందిన సొనాటా కార్ ను అగంతకులు ఈనెల 3వ తేదీన ఎత్తుకుపోయినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓషివర రెస్టారెంట్ ముందు కారు పార్కింగ్ చేసినప్పుడు ఈ దొంగతనం జరిరింది. ఓషివర దాబా నుంచి ఫుడ్ ప్యాకింగ్ కోసం తన డ్రైవర్ వెళ్లినప్పుడు కారు పోయిందని జీనత్ సోదరుడు జహీర్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కారు డ్రైవర్ ఫుడ్ ప్యాకింగ్ చేసుకుని తిరిగి వచ్చే సరికి కారు లేదనీ, ఆ విషయం తనకు చెప్పగానే ఓషివర పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చాననీ జహీర్ ఖాన్ తెలిపారు. దీంతో పోలీసులు కారు ఆచూకీ కోసం అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఓషివర పోలీసు స్టేషన్ పరిధిలోని జోన్ 9కి చెందన డిఎస్ పి నికేత్ కౌషిక్ ను సంప్రదించినప్పుడు ఇది దొంగతనం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఎసిపి (డిఎన్ నగర్ డివిజన్ ) దిలీప్ సూర్యవంశీ మాత్రం ఈ దొంగతనం ఓషివర పోలీసు స్టేషన్ పరిధిలో ని రెస్టారెంట్ వద్ద జరిగిందనీ, బాధితుల న ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతోందనీ చెప్పారు.
News Posted: 11 February, 2009
|