ముంబై:బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ ఈ వాలంటైన్స్ డేను కొత్త గాల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్‌తో రొమాం టిక్‌గా జరుపుకోవడానికి ప్లాన్ చేశాడట...దీపిక పడుకోనెతో కపూర్ సాగించిన ప్రేమాయణం గురించి బాలీవుడ్ లో కథలు కథలుగా చెప్పుకున్న విషయం తెలిసిందే. దాదాపు పెళ్ళి పీటల వరకు వచ్చిన ఈ ప్రేమ క్లైమాక్స్ లో బెడిసి కొట్టింది.
దీంతో అతను ఈ మధ్య కాలంలో కత్రినా కైఫ్ తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. కొత్త గాల్ ఫ్రెండ్ కు ఒక సర్‌ప్రైజ్ గిఫ్టు కూడా ఇవ్వబోతు న్నాడట...తాజాగా వీళ్లిద్దరూ జంటగా కలిసి నటిస్తున్న 'అజాబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ' చిత్రం షూటింగ్‌లో డ్యూయెట్ సాంగ్స్ చిత్రీకరణను టర్కీలో చేయాలని ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 14న ఆ చిత్రం షూటిం గ్‌లో వీళ్లిద్దరూ అక్కడే ఉంటారట...కాకపోతే గత సంవత్సరం కత్రినా తన బాయ్ ఫ్రెండ్ సల్మాన్‌తో ఉంది. ఇప్పుడు కపూర్ తో వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోబోతోంది. ఎటొచ్చి ఈ ఏడాది ఇద్దరికీ పార్టనర్స్ మారడం విశేషం.